రేవంత్ రెడ్డి ఒక 'హైబ్రిడ్' సీఎం.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

by Prasad Jukanti |

పార్లమెంట్‌లో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గించే కుట్రలను సహించబోమని కేటీఆర్ హెచ్చరించారు.

రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ సీఎం.. కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ లో దక్షిణాది ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. మహిళా రిజర్వేషన్లకు బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తోందని కానీ మహిళా బిల్లును డీలిమిటేషన్ తో ముడిపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి ఒక హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ వైఖరిలో స్థిరత్వం లేదని ఆయన ఉదయం కాంగ్రెస్ ప్రతినిధిగా, సాయంత్రం బీజేపీ నేతగా ఉంటారని ఆరోపించారు. హైబ్రిడ్ విధానం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పాలనలో కూడా కనిపిస్తోందన్నారు. కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెడుతున్న బిల్లులో అస్పష్టత ఉందన్నారు.

సీఎం హైబ్రిడ్ మోడల్:

కాగా నియోజకవర్గాల సంఖ్యను కేవలం జనాభా ఆధారంగా పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారంగా ఆయన హైబ్రిడ్ మోడల్ ను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. 50 శాతం సీట్లు జనాభా ప్రాతిపదికన కేటాయించాలని మరో 50 శాతం సీట్లు ఆయా రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధి ఆధారంగా కేటాయించాలని సూచించారు. దీని వల్ల జనాభా నియంత్రణ పాటించి, దేశ ఆర్థిక వ్వయస్థకు తోడ్పడిన దక్షిణాధి రాష్ట్రాలకూ న్యాయం జరుగుతుందని వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ స్పందించిన కేటీఆర్ రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై పై విధంగా సెటైర్ వేశారు.

Next Story