- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘తెలంగాణ గెలిచింది’.. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆసక్తికర ట్వీట్
by Satheesh |
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంపై రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంపై రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ గెలిచిందని హర్షం వ్యక్తంచేశారు. ‘బీఆర్ఎస్‌ను దింపడానికి నిరంతరంగా పోరాడిన పౌర సంఘాలకు నా ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు. రేవంత్ రెడ్డి, పొంగులేటి, భట్టి విక్రమార్క, సీతక్క, వివేక్ వెంకట స్వామికి శుభాకాంక్షలు, విజయ భేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ కి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజల విజ్ఞతకు నా పాదాభివందనాలు. తెలంగాణ అమరవీరులకు పాదాభివందనాలు. జై తెలంగాణ, జై ప్రజాస్వామ్యం, జై రాజ్యాంగం’ అని పేర్కొన్నారు. ఓ పోటో సైతం పోస్ట్ చేశారు.
Next Story






