న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. మార్గదర్శకాలు విడుదల

by Muthe.Rajitha |

రాబోయే 2026 న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షల మార్గదర్శకాలు జారీ చేసింది పోలీసు శాఖ.

న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు.. మార్గదర్శకాలు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్ : రాబోయే న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షల మార్గదర్శకాలు జారీ చేసింది పోలీసు శాఖ. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డిసెంబర్ 31 నుంచి జనవరి 1 వరకు జరగబోయే న్యూ ఇయర్ వేడుకలు, పార్టీలు, డీజే ఈవెంట్లు, పబ్ ప్రోగ్రామ్స్, ఫైర్‌వర్క్స్, రోడ్ షోలు వంటి అన్ని కార్యక్రమాలకు ముందస్తు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి చేసింది. ఈమేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈవెంట్ ఆర్గనైజర్లు, హోటల్స్, రిసార్ట్స్, క్లబ్బులు, వ్యక్తులు డిసెంబర్ 15 లోపు https://cybpms.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.

ఆ తర్వాత వచ్చే అప్లికేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఆల్కహాల్, డ్రగ్స్, భారీ సౌండ్, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాంలు, డ్రంకెన్ డ్రైవింగ్ తోపాటు గతంలో జరిగిన అవాంఛిత ఘటనలను అరికట్టేందుకు ఈ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ మార్గదర్శకాలు పాటించని ఈవెంట్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story