- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jubilee Hills: గుంపులుగా ఉండొద్దు.. జూబ్లీహిల్స్ లో సజ్జనార్ ఆంక్షలు
జూబ్లీహిల్స్ లో ఆంక్షలు విధిస్తూ సజ్జనార్ ఆదేశాలు విధించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills by-election) పరిధిలో ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ సీపీ వి.సి సజ్జనార్ (VC Sajjanar) నోటిఫికేషన్ విడుదల చేశారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలవుతాయని సజ్జనార్ పేర్కొన్నారు. కౌంటింగ్ సందర్భంగా నవంబర్ 14 ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. ప్రజాశాంతి, భద్రత కోసం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో బీఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమల్లో ఉండనున్నట్లు చెప్పారు. ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది ఒక్కచోట గుంపుగా ఉండొద్దని సూచించారు. పోలింగ్ కేంద్రాల నుంచి 200 మీటర్ల వరకు ఈ రూల్ వర్తిస్తుందని తెలిపారు. ఈ నిర్దేశించిన సమయాల్లో నియోజవర్గంలో పరిధిలోని లిక్కర్ షాపులు, రెస్టారెంట్‍లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ పరిధిలో ఎవ్వరూ బాణాసంచా పేల్చొద్దని ఆదేశించారు.






