బోర్డు సభ్యుల రాజీనామాలు సరే.. పేపర్ లీకేజీలపై విచారణ జరపాలి : ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్

by Disha Web Desk 1 |
బోర్డు సభ్యుల రాజీనామాలు సరే.. పేపర్ లీకేజీలపై విచారణ జరపాలి : ఏఐఎస్ఎఫ్ నాయకుల డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : టీఎస్‌పీ‌ఎస్‌సీ చైర్మన్, సభ్యుల రాజీనామాను గవర్నర్ ఆమోదించడం సరైనదే కానీ, పేపర్ లీకేజీకి సంబంధించి వారిని కూడా విచారించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేపర్ లీకేజీల విచారణను జాప్యం చేయకుండా విచారణ వేగవంతం చేయాలని అన్నారు. భవిష్యత్తులో ఎవరు కూడా పేపర్ లీకేజీ‌లకు పాల్పడకుండా ఉండేలా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పాత చైర్మన్, సభ్యుల రాజీనామాతో నూతనంగా ఏర్పాటు చేసే టీఎస్‌పీ‌ఎస్‌సీ బోర్డు పారదర్శకంగా ఉండాలని అన్నారు. బోర్డులో విద్యావంతులు, మేధావులను ఉండేలా చూడాలన్నారు. రాజకీయాలకు అతీతంగా బోర్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు, ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని, పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాక ముందే వాయిదా పడిన గ్రూప్స్ పరీక్షలు, డీఎస్సీ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement
Next Story

Most Viewed