2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దు : హైకోర్టు

by Shamantha N |
2010 తర్వాత జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లన్నీ రద్దు : హైకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఓబీసీ సర్టిఫికెట్లపై కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2010 తర్వాత బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీంతో దాదాపు 5 లక్షల ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు కానున్నాయి. రిజర్వేషన్ల చట్టంలోని నిబంధనలను సవాలు చేస్తూ కోల్‌కతా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఓబీసీ వర్గీకరణలు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టంచేసింది. 1993 నాటి వెనకబడిన వర్గాల చట్టానికి అనుగుణంగా కొత్త ఓబీసీ జాబితాను సిద్ధం చేయాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఓబీసీ కేటగిరీలో ఉద్యోగాలు పొందిన వారిపై ఈ తీర్పు ప్రభావం చూపిందని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పుపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అసహనం వ్యక్తం చేశారు. 2011లో బెంగాల్ లో దీదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇదంతా బీజేపీ కుట్ర అని.. బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓబీసీ రిజర్వేషన్ కోటా కొనసాగుతుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇంటింటికి సర్వే నిర్వహించి ముసాయిదా బిల్లు రూపొందించామని.. కేబినేట్, అసెంబ్లీలో బిల్లును ఆమోదించామని ఆమె చెప్పారు.

Next Story