బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు : సుప్రీంకోర్ట్

by Muthe.Rajitha |

సుప్రీంకోర్ట్ మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తెలంగాణ, ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు ఖచ్చితంగా 30% రిజర్వేషన్లు ఇవ్వాలని రెండు రాష్ట్రాల బార్ కౌన్సిళ్లను ఆదేశించింది.

బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు : సుప్రీంకోర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్ట్ మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై తెలంగాణ, ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు ఖచ్చితంగా 30% రిజర్వేషన్లు ఇవ్వాలని రెండు రాష్ట్రాల బార్ కౌన్సిళ్లను ఆదేశించింది. అయితే త్వరలో జరగబోయే బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది సుభాషిణి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మహిళలకు 30% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికలకు ఈనెల 20న నోటిఫికేషన్ రానుంది. జనవరి 30న ఎన్నికలు జరగనుండగా.. ఫిబ్రవరి 10న కౌంటింగ్, ఫలితాల వెల్లడి కానుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మహిళా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story