- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Renuka Chowdary: కాంగ్రెస్ పాలనకు వరుణ దేవుడు తోడయ్యాడు: రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ఆసక్తికర వ్యాఖ్యలు
by Kema Shiva Kumar |
రాష్ట్రంలో ఇది వరకు ఏ ప్రభుత్వం చేయని ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ అనే సహసాన్ని తమ సర్కార్ చేసిందని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇది వరకు ఏ ప్రభుత్వం చేయని ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ అనే సహసాన్ని తమ సర్కార్ చేసిందని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతు నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఎంపీ రఘురామరెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నదాతల కష్టాలను చూసి ప్రభుత్వం రుణమాఫీ చేసిందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలన చూసి వరుణ దేవుడు ముగ్ధుడై రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిపిస్తుండటం శుభ పరిణామమని రేణుకా చౌదరిన అన్నారు.
Next Story






