పాదయాత్ర కాదు పరిగెత్తే యాత్ర చేసినా మాకు ఢోకా లేదు.. కేటీఆర్‍పై రేణుకాచౌదరి సెటైర్లు

by Prasad Jukanti |

కేటీఆర్ పాదయాత్రపై రేణుకా చౌదరి స్పందించారు. అలాగే రాజ్యసభలో అమరావతిని 'కమరావతి' అని ఎందుకు అన్నారో స్పష్టత ఇచ్చారు.

పాదయాత్ర కాదు పరిగెత్తే యాత్ర చేసినా మాకు ఢోకా లేదు.. కేటీఆర్‍పై రేణుకాచౌదరి సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ కోసం అవసరం అయితే తాను 2027లో పాదయాత్ర చేస్తానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి (Renuka Chowdhury) సెటైర్లు వేశారు. కేటీఆర్ (KTR) పాదయాత్ర చేస్తే ఆరోగ్యానికి మంచిదేనన్నారు. ఆయన పాదయాత్ర కాదు పరిగెత్తే యాత్రలు చేసినా కాంగ్రెస్‍కు ఏమీ కాదన్నారు. ఇవాళ ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన రేణుకా చౌదరి.. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుందని ధ్వజమెత్తారు. ఏపీలో విలీనమైన ఐదు పంచాయతీల్లోనే భద్రాచలం ఆలయ భూములు ఉన్నాయి. వాటిని తిరిగి తెలంగాణలో కలపాలపాలన్నారు. బీజేపీతో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడి సమస్యను పరిష్కరించాలన్నారు.

కమరావతి అని ఎందుకన్నానంటే..

అమరావతి బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా 'పెట్టరా అమరావతి, పిలవరా కమరావతి' అని ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. అమరావతి కాదు కమరావతి అని గతంలో జగన్ వ్యంగ్యంగా అన్నారని అందుకే అదే మాటను తాను సభలో గుర్తుచేశానని వివరణ ఇచ్చారు. కాగా రాజ్యసభలో కమరావతి అంటూ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కాంట్రవర్సీకి దారి తీశాయి. పార్లమెంట్ వేదికగా ఓ రాజధానికి కులంతో లింక్ పెట్టారని ప్రతిపక్ష వైసీపీ విమర్శలు చేయగా తాజాగా తాను ఎందుకు అలా అనాల్సి వచ్చిందో రేణుకా చౌదరి స్పష్టత ఇచ్చారు.
Next Story