సోనియా చేయకపోతే నేనే పోటీ చేస్తా.. కేంద్ర మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
సోనియా చేయకపోతే నేనే పోటీ చేస్తా.. కేంద్ర మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయబోతోందని వస్తున్న వార్తలపై ఆ పార్టీ కీలక నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీని ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని తామే కోరినట్లు తెలిపారు. స్వయంగా సోనియా పోటీ చేస్తే అంతకంటే అదృష్టం ఏముంటుందని అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ తన నిర్ణయం ఏంటో చెప్పే వరకూ ఎవరూ అభ్యర్థి కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ పరిస్థితులు అనుకూలించక సోనియా ఖమ్మం నుంచి పోటీ చేయకపోతే తానే పోటీ చేస్తానని రేణుకా చౌదరి మనసులోని మాట బయటపెట్టారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 13 స్థానాలకు పైగా కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని ఆమె జోస్యం చెప్పారు.

Next Story

Most Viewed