- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న వినాయక విగ్రహం తొలగింపు
by Ajay Maddhiboyina |
సీఎం రేవంత్ రెడ్డి రూపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని తొలగించారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి రూపంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని తొలగించారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గం అఘాపూరలో ఫిషరీస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దేవుడి విగ్రహాన్ని మనిషి రూపంలో ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని కాబట్టి విగ్రహాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని డీసీపీని కోరారు. ఈ నేపథ్యంలోనే విగ్రహాన్ని తొలగించినట్టు తెలుస్తోంది. విగ్రహాన్ని తొలగించి మరో విగ్రహం ఏర్పాటుచేసుకోవాలని నిర్వాహకుడు మెట్టు సాయికుమార్‌కు సౌత్ వెస్డ్ డీసీపీ సూచించినట్టు సమాచారం.
Next Story






