ఓటుకు నోటు కేసు.. CM రేవంత్‌కు ఊరట

by Gantepaka Srikanth |

తెలుగు రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసు(Cash For Vote Case) మరోసారి చర్చకు వచ్చింది.

ఓటుకు నోటు కేసు.. CM రేవంత్‌కు ఊరట
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు నోటు కేసు(Cash For Vote Case) మరోసారి చర్చకు వచ్చింది. శుక్రవారం (జూన్ 13న) రోజున ఓటుకు నోటు కేసుపై నాంపల్లి కోర్టు(Nampally Court) విచారణ జరిగింది. అయితే నేటి విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు ఈ కేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహా, వేం కృష్ణకీర్తన్‌లకు మినహాయింపు ఇచ్చింది. మరోవైపు ఇవాళ్టి విచారణకు సండ్ర వెంకట వీరయ్య, మత్తయ్య హాజరయ్యారు. విచారణ వేగంగా జరిపి కేసును తేల్చాలని వారు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌ దృష్ట్యా వాయిదా వేయాలని నిందితుల లాయర్ల కోరగా.. పైకోర్టులో స్టే పొందాలి లేదా ఇక్కడ విచారణ కొనసాగించాలని కోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను జులై 25వ తేదీకి వాయిదా వేసింది.

Next Story