తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ : స్టేట్ ఎలక్షన్ కమిషన్

by Muthe.Rajitha |

మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

తొలి విడత పంచాయితీ ఎన్నికల్లో రికార్డు స్థాయి పోలింగ్ : స్టేట్ ఎలక్షన్ కమిషన్
X

దిశ, వెబ్ డెస్క్ : మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే ఎలాంటి గొడవలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 84.28% శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కోన్నారు. మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 84.28% శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 53,57,277 ఓటర్లు ఉండగా 45,15,141 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు. 31జిల్లాలో ప్రశాంతంగా పోలీంగ్ ప్రక్రియ ముగిసినట్లు తెలిపారు. జిల్లా వారిగా ఖమ్మం , సూర్యపేట, నల్గోండ జిల్లాలలో అత్యధికంగా 90శాతం ఓటింగ్ నమోదు కాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79శాతం అత్యల్పంగా ఓటింగ్ నమోదైంది.

Next Story