సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన RBI గవర్నర్

by Muthe.Rajitha |

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాద పూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన RBI గవర్నర్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాద పూర్వకంగా కలిశారు. బోర్డు సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆర్బీఐ గవర్నర్, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాల్లో అమలు చేస్తున్న సంస్కరణలను సీఎం రేవంత్ ఆర్బీఐ గవర్నర్ కు వివరించారు. విద్యుత్ రంగంలో చేపట్టిన సంస్కరణలు, మూడో డిస్కం ఏర్పాటు వంటి అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ వినియోగం పెంచే దిశగా తీసుకుంటున్న చర్యలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు.

మరిన్ని సంస్కరణలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అలాగే, తెలంగాణలో BUDS (Banning of Unregulated Deposit Schemes) యాక్ట్‌ను నోటిఫై చేయాలని ఆర్బీఐ గవర్నర్ ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్‌ఫేస్ (ULI) విషయంలో ఆర్బీఐ తీసుకుంటున్న చొరవతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు డిపాజిట్ల క్లెయిమ్ క్యాంపెయినింగ్ తదితర అంశాలను వివరించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Next Story