- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్‍కు 14 రోజుల రిమాండ్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహన్ నాయక్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నిన్న మాదాపూర్ లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 15 చోట్ల తనిఖీలు చేపట్టిన ఏసీబీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకుని కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు రిమాండ్ విధించడంతో మోహన్ నాయక్‍ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
బడా కాంట్రాక్టర్లకు కొమ్ము కాస్తూ..
నిజామాబాద్ జిల్లా డిచ్‍పల్లి మండలం ముల్లంగి పంచాయతీ కులాస్‍పూర్ తండాకు చెందిన మోహన్ నాయక్ 29 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. వివిధ హోదాలో ఆయా జిల్లాలో పని చేసిన ఆయన గతేడాది సెప్టెంబర్ లో ఆర్ అండ్ బీ ఈఎన్సీగా నియమితులయ్యారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున అక్రమాలకు తెరలేపారని ఆర్‍అండ్‍బీ శాఖలో టెండర్ల కేటాయింపు, బిల్లుల మంజూరు ఇలా అన్నింటికి కమీషన్లు లేనిదే పనులు ముందుకు సాగవన్న ఆరోపణలు అతడిపై ఉన్నాయి. చిన్న గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తూ బడా గుత్తేదారులతో తరచూ సమావేశం కావడం సంబంధిత శాఖ వర్గాల్లో బహిరంగ రహస్యంగా మారింది. ఈ నేపథ్యంలో అతడిపై ఫోకస్ పెట్టిన ఏసీబీ మంగళవారం ఏకకాలంలో మెరుపు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖఈల్లో అతడి ఇంట్లో మొత్తంకా రూ. 17.94 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ. 150 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.






