- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ఫ్ స్కిడ్ తో యాక్సిడెంట్స్.. ఆరు నెలలలో 140 మంది మృతి..
రాత్రి సమయాల్లో ద్విచక్రవాహనాలను జాగ్రత్తగా నడపండి లేదంటే మీరు మృత్యువు బారిన పడాల్సిందేనని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

దిశ, సిటీక్రైం : రాత్రి సమయాల్లో ద్విచక్రవాహనాలను జాగ్రత్తగా నడపండి లేదంటే మీరు మృత్యువు బారిన పడాల్సిందేనని రాచకొండ పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయాల్లో నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం మత్తులో వాహనాలను నడుపుతు చాలా మంది వాహనదారులు వారికివారే స్కిడ్ అవుతు రోడ్డు ప్రమాదాలకు గురవతున్నారని పోలీసులు తెలిపారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలలో పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించినప్పుడు వాహనదారుల డ్రైవింగ్ లో వారి సొంత తప్పిదాల వల్ల వాహనాలను స్కిడ్ చేసుకుని యాక్సిడెంట్ లకు గురయ్యి 140 మంది చనిపోగా, 112 మంది తీవ్ర గాయాలకు గురయ్యారు.
110 సెల్ఫ్ స్కిడ్ యాక్సిడెంట్ లు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.ఈ యాక్సిడెంట్ లలో మరణించిన వారిలో అధికంగా హెల్మెట్ పెట్టుకోకపోవడంతో వారు ప్రాణాలను కోల్పోయారని పోలీసులు వివరించారు. ఈ నేపధ్యంలో వాహనదారులు వాహనం నడిపే సమయంలో కచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరుతున్నారు. అవగాహన కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ లేకుండా వాహనాలను నడిపించే వారిని గుర్తించి వారు హెల్మెట్ ధరించేలా చర్యలను తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు.
అదే విధంగా డ్రంకన్ డ్రైవింగ్ చేసే వాహనదారుల పై చట్టపరంగా కఠినంగా ఉంటున్నామని చెప్పారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలలలో 1822 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోగా అందులో 363 మంది మృతి చెందారని, 1657 మంది తీవ్ర గాయాలపాలయ్యారని పోలీసులు వెల్లడించారు. నిరంతరం తనిఖీలతో పాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం వల్ల గత సంవత్సరాలలో మొదటి ఆరు నెలలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాల మరణాలను ఈ ఏడాది తగ్గించగలిగామని పోలీసులు అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్ రూల్స్ పాటించి వాహనదారులు రోడ్ల పై సురక్షితంగా ప్రయాణీంచాలని పోలీసులు కోరుతున్నారు.






