అదే జరిగితే నా తల తీసేయండి : రసమయి సంచలన ప్రకటన

by Muthe.Rajitha |

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ప్రకటన చేశారు.

అదే జరిగితే నా తల తీసేయండి : రసమయి సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఇదే చివరి పాలన అని, తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ గెలిస్తే తన తల తీసియండి అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి సవాలును కేటీఆర్ స్వీకరించి 72 గంటల టైమ్ కూడా ఇచ్చారని, అయినా చర్చకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ నేతలు అసభ్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ నేతలు ఇసుక దందాలు చేస్తున్నారని, పందొమ్మిది నెలల పాలనలో కాంగ్రెస్ చేసింది శూన్యమని మండిపడ్డారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను తిడితే హెడ్ లైన్లలో ఉంటామనే కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ నేతల తిత్తి తీయడానికి సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ ఇక జన్మలో అధికారంలోకి రాదన్నారు. మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నా తలను గాంధీ భవన్ పై వేలాడదీసుకుంటానని, ఇదే తన మరణ వాంగ్మూలం అన్నారు.

Next Story