- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డ్రైనేజీ పొంగిరోడ్డు పై ప్రవహిస్తున్న పట్టించుకోని మున్సిపల్ అధికారులు
దిశ, శంకర్ పల్లి : మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో డ్రైనేజీ పొంగి పొర్లడంతో మురుగునీరు ప్రవహిస్తున్న సంబంధిత

దిశ, శంకర్ పల్లి : మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలలో డ్రైనేజీ పొంగి పొర్లడంతో మురుగునీరు ప్రవహిస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రోడ్డు పై మురుగునీరు ప్రవహించడంతో మురుగు నీటిని దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శంకర్ ప ల్లి మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో డ్రైనేజీ పొంగి రోడ్డు పై ప్రవహిస్తుందని మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని కాలనీవాసులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీ పగిలి నెల రోజులు గడుస్తున్న మరమ్మత్తు చేయడంలో మున్సిపల్ అధికారులు ఘోరంగా విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మున్సిపల్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని కాలనీవాసులు వాపోతున్నారు.
ఆ వార్డులో కూడా అదే పరిస్థితి
మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డులో కూడా డ్రైనేజీ పొంగి పొర్లుతుందని.. మురుగు నీరు విషయం పై అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కమిషనర్ స్పందించడం లేదని 24న కాలనీవాసులు కలెక్టర్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు.
పత్తాలేని ప్రత్యేక అధికారి
మున్సిపల్ పాలకవర్గం ముగిసిన తరువాత ప్రభుత్వ అధికారులను ఏర్పాటు చేసింది. శంకర్ పల్లికి ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారి ఏనాడు కూడా కార్యాలయానికి వచ్చిన పాపాన పోలేదు. దీంతో సమస్యలు పరిష్కారం కాక కలెక్టర్ ఫిర్యాదు చేసిన మురుగునీటి సమస్య పరిష్కారం కావడం లేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
డ్రైనేజీ పొంగి ప్రవహిస్తున్న పట్టించుకోరా..? : క్రాంతి రెడ్డి
మున్సిపల్ పరిధిలోని సంగారెడ్డి అపోలో ఫార్మాసీ వెనుకాల రోడ్డులో డ్రైనేజీ పొంగి రోడ్డుపైన ప్రవహిస్తుందని స్థానికుడు క్రాంతి రెడ్డి ఆరోపించారు. రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తున్న ఎవరు పట్టించుకోవడం లేదు. మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి నెల రోజులు గడుస్తున్న వారు స్పందించిన పాపాన పోలేదు. ప్రతిరోజు మురుగు నీటిలో నుంచే వెళ్లాల్సి వస్తుంది. రోడ్డు పై మురుగునీరు పారటంతో దుర్గంధం వేసి దోమలు ఈగలు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రజలు అంటు రోగాల బారిన పడకముందే మున్సిపల్ అధికారులు స్పందించాలి. స్వచ్ఛ భారత్ చెట్లు నాటాలి. పర్యవరణాన్ని కాపాడాలి. పారిశుధ్య నివారణకు సహకరించాలి. గోడలకు రాతలు రాయడం కాదు.. మున్సిపల్ అధికారులు పాటిస్తే ప్రజలకు ఇబ్బందులు ఉండవు.






