Tomato prices: టమాటా ధర ఢమాల్..కిలో నాలుగు రూపాయ‌లే

by velandi.Saikiran |   (  Updated:2026-03-02 20:30:32  IST  )

టమాట రేట్లు భారీగా పడిపోయాయి. వ్యాపారులు కిలోకు 4 రూపాయలు కూడా పెట్టడం లేదు.

Tomato prices: టమాటా ధర ఢమాల్..కిలో నాలుగు రూపాయ‌లే
X

కిలో నాలుగు రూపాలే

- టమాట ధరలు ఢమాల్

- 25 కిలో ల టమాటా బాక్స్ కు రూ. 100

- రైతులకు దక్కని గిట్టుబాటు ధర

దిశ, చేవెళ్ల: టమాట ధర రైతులను ఊరిస్తూ ఉసూరుమనిపిస్తూనే ఉంది. ధర బాగుందని రైతులు సంబరపడేలోపే ఉన్నపళంగా ధరలు పడిపోవడం కోలుకోలేని దెబ్బతీస్తోంది. తాజాగా టమాట ధర భారీగా పతనమైంది. టమాట రేట్లు భారీగా పడిపోయాయి. వ్యాపారులు కిలోకు 4 రూపాయలు కూడా పెట్టడం లేదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ లో 25 కిలోల టమాట బాక్స్ కు రూ.100 ధర పలుకుతుంది. 25 కిలోల టమాట బాక్స్ కు 100 రూపాయలు అంటే కిలో టమాటా 4 రూపాయల ధర పలుకుతుంది. పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుబడులు వస్తుండడంతో కిలోకు రూ.5 కూడా రాకపోవడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. కూలీలతో తెంపించి, తీసుకెళ్తే ఇటు కూలి పైసలు, అటు కిరాయి మీద పడ్తుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

టమాట రేట్లు భారీగా పడిపోయాయి. వ్యాపారులు కిలోకు రూ.5 కూడా పెట్టడం లేదు. పక్క రాష్ట్రాల నుంచి భారీగా దిగుబడులు వస్తుండడంతో కిలోకు రూ.5 మాత్రమే చెల్లిస్తుండడంతో అన్నదాతలు ఆగమవుతున్నారు. కూలీలతో తెంపించి, తీసుకెళ్తే ఇటు కూలి పైసలు, అటు కిరాయి మీద పడ్తుండడంతో టమాటాలను తోటల్లోనే వదిలేస్తున్నారు. కొందరు పశువులకు మేతగా వేస్తున్నారు. మరికొందరు ఫ్రీగా పంచుతున్నారని సమాచారం.. వేలకు వేలు పెట్టుబడి పెట్టి టమాట తోటలు సాగుచేశామని, తీరా రేటు పడిపోవడంతో పెట్టుబడులకూ మునుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. బయట కూరగాయల మార్కెట్లో రూ.4లకు ధర ఉండడంతో రైతులకు నష్ఠాలు వస్తున్నాయి.

ఉమ్మడి జిల్లాలో..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్, మేడ్చల్ జిల్లా ల వ్యాప్తంగా కూరగాయలు పండిస్తున్నారు. సోమవారం చేవెళ్ల, శంకర్ పల్లి, శంషాబాద్ తదితర సంత కావడంతో పలు గ్రామాల రైతులు ఆటోలో టమాటాలు తీసుకొచ్చారు. వ్యాపారులు కొనేందుకు ముందుకు రాకపోవడంతో తిరిగి తీసుకెళ్లలేక అక్కడే తెచ్చిన ఆటోలో ఉచితంగా టమాటాలు పంచిపెడుతున్నారు. మరికొందరు పారబోస్తున్నారు. దీంతో జనాలు టమాటాల కోసం ఎగబడ్డారు. టమాట ధరలు తగ్గుముఖం పట్టడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదని..కూలీల ఖర్చులు కూడా చేతి నుంచి పెట్టుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటకు గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.

ధర ఊరిస్తూ..

టమాటా ధరలు ఉసూరుమనిపిస్తూనే ఉంది. ధర బాగుందని రైతులు సంబరపడేలోపే ఉన్నపళంగా పడిపోవడం కోలుకోలేని దెబ్బతీస్తోంది. తాజాగా టమాట ధర భారీగా పతనమైంది. ఎన్నో ఆశలతో రూ.లక్షలు పెట్టి పంట సాగు చేసిన రైతులకు పెట్టుబడి కాదు కదా రవాణా, కూలీల ఖర్చులు కూడా దక్కని పరిస్థితి నెలకొంది. అనంతపురం శివారులోని కక్కలపల్లి టమాట మార్కెట్ కు ఇటీవల కాలంలో రోజూ 500 టన్నుల నుంచి 800 టన్నుల వరకు సరుకు అమ్మకానికి మార్కెట్ వస్తోంది. ధరలు పూర్తిగా నేలచూపులు చూస్తుండడంతో దిక్కుతోచడం లేదు. గత నెలన్నర రోజులుగా అత్యంత నాణ్యమైన టమాట కొన్ని లాట్లు గరిష్ఠ ధర కిలో రూ.5 పలుకుతుండగా.. ఇప్పుడు మరింతగా క్షీణించి రూ.4కి పడిపోయింది. వారం రోజులుగా టమాటను అడిగేవారు కరువయ్యారు. కనిష్ట ధర రూ.3కు మించడం లేదు. దీంతో మార్కెట్కు తరలించడానికి రవాణా ఖర్చులు, కమీషన్లకు కూడా రావడం లేదు. టమాట పరిస్థితి దయనీయంగా ఉన్నా చంద్రబాబు ప్రభుత్వం ఆదుకునే చర్యలు చేపట్టకపోవడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story