- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిక్కులో లక్కు అంటే ఇదేనేమో! మద్యం షాపు వదులుకుంటే రూ.92 లక్షలు.. వారికి ‘సిండికేట్’ ఆఫర్లు
మద్యం దుకాణాల్లో లాటరీ పొందలేని వారు షాపులను దక్కించుకున్న వారికి భారీ మొత్తంలో ఆఫర్ చేస్తున్నారు.

దిశ, ఆమనగల్లు: మద్యం దుకాణాల్లో లాటరీ పొందలేని వారు షాపులను దక్కించుకున్న వారికి భారీ మొత్తంలో ఆఫర్ చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఆమనగల్లు మున్సిపాలిటీ హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి కావడంతో ప్రతి నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో 6 మద్యం దుకాణాలకు టెండర్ నిర్వహించగా అదృష్టం దక్కని సిండికేట్ వ్యాపారులు మద్యం దుకాణం పొందిన వారికి గుడ్ విల్ రూపంలో వల విసురుతున్నారు.
వద్దనుకుంటే కాసుల వర్షమే
మద్యం దుకాణం నిర్వహించాలంటే రూ.50 లక్షల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే తమకు లైసెన్స్‌ను అప్పగిస్తే రూ.కోటి నగదు ఇస్తామని మద్యం సిండికేట్ బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. పట్టణ కేంద్రంలోని కల్వకుర్తి రోడ్డులో ఉన్న మద్యం దుకాణాన్ని సిండికేట్ వ్యాపారులు రూ.92 లక్షలకు దక్కించుకున్నారు. అదేవిధంగా పరిగి ప్రాంతానికి చెందిన వ్యక్తి టెండర్లలో ఆమనగల్లులోని మద్యం దుకాణాన్ని దక్కించుకోగా మద్యం షాపు లైసెన్స్ వదులుకుంటే రూ.కోటి చెల్లిస్తామని.. ప్రస్తుతం ఆమనగల్లులో మద్యం వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సిండికేట్ వ్యాపారులు ఆఫర్లు ఇస్తున్నారు. కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలంలోని పలు చోట్ల అయితే లైసెన్స్‌లు అప్పగిస్తే డబ్బులతోపాటు పెట్టుబడి లేకుండానే గుడ్ వీల్ కింద నెలకు 15 వేల వరకు ఇస్తామని మభ్యపెడుతున్నట్లు తెలుస్తోంది.






