- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడేళ్లు పూర్తవుతున్నా..కొలిక్కిరాని రావులపల్లి రోడ్డు
వికారాబాద్ రోడ్లు భవనాల శాఖ రోడ్డు నుంచి రావులపల్లి కలాన్ గ్రామం వరకు రోడ్డు అధ్వాన్నంగా తయారైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

దిశ, శంకర్‌పల్లి : వికారాబాద్ రోడ్లు భవనాల శాఖ రోడ్డు నుంచి రావులపల్లి కలాన్ గ్రామం వరకు రోడ్డు అధ్వాన్నంగా తయారైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. శాసనసభ ఎన్నికలకు ముందు రోడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు కాగా అప్పట్లో రోడ్డును తవ్వి వదిలేశారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్డు నిర్మాణానికి మరో రెండు కోట్లు నిధులు విడుదల చేశారు. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎంతో అట్టహాసంగా రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. మా గ్రామానికి రోడ్డు త్వరలో పూర్తవుతుందని గ్రామస్తులు ఎంతో సంతోషపడ్డారు. వారి సంతోషం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎట్టకేలకు కాంట్రాక్టర్ రోడ్డును తవ్వి కంకర పోసి చదును చేసి వదిలేసాడు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో రోడ్డు పనులు కొనసాగుతుండగా రోడ్డు పనులు మూడు అడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కు చందాన మూడేళ్లు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తి కాలేదు. ప్రతినిత్యం గ్రామస్తులు రైతులు మహిళలు శంకరపల్లికి రావాలన్నా శంకర్పల్లి నుంచి గ్రామానికి వెళ్లాలన్న కంకర రోడ్డు పైనుంచి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట ప్రయాణం వారి పాలిట శాపంగా మారుతుంది. ఒక్కోసారి ద్విచక్ర వాహనాలు ప్రమాదానికి కూడా గురవుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తారు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
మూడేళ్లు అవుతున్న పూర్తికాని రావులపల్లి రోడ్డు..
- మహేష్ రావులపల్లి కలాన్
ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు నుంచి అధికారులు ప్రజాప్రతినిధులు ఊరిస్తూ వచ్చారు. ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లు కాగానే రోడ్డు పనులు ప్రారంభమవుతాయన్నారు. ఎన్నికలయ్యాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యే రోడ్డు పనులు ప్రారంభిస్తే ఎంతో సంతోషపడ్డాం. కానీ కంకర పోసి వదిలేశారు. కంకర రోడ్డుపై మూడు కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తుంది. ప్రతినిత్యం గ్రామస్తులు రైతులు విద్యార్థులు ఇదే రహదారిపై శంకర్పల్లికి వెళుతుంటారు. కంకర రోడ్డుపై ద్విచక్ర వాహనంపై వెళ్లాలంటే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే తారు రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేయాలి.
త్వరలో పనులు ప్రారంభిస్తాం..
- చేవెళ్ల పంచాయతీ రాజ్ డీఈ గణేష్
రావులపల్లి కలాన్ గ్రామానికి వెళ్లే రోడ్డు కంకర రోడ్డు పూర్తయింది. తారు రోడ్డు వేయాల్సి ఉంది. తారు రోడ్డు వేయాలంటే బీటీ రేట్లు పెరిగిపోయినందున ప్రస్తుతం మంజూరై ఉన్న రూ.2.50 కోట్ల నిధులు సరిపోవడం లేదు. సుమారు మూడున్నర కిలోమీటర్ల దూరం తారు రోడ్డు వేయడానికి సుమారు 50 లక్షలు అవసరమవుతాయి. ఇదే విషయం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి ఈ నెలాఖరులోగా తారు రోడ్డు పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. లేదంటే ప్రస్తుతం ఉన్న నిధులతో ఎంతవరకు రోడ్డు పూర్తయితే అంతవరకు పనులు చేస్తాం.






