అడ్డొస్తే పైనుంచి ట్రాక్టర్ ఎక్కిస్తాం.. ఇసుక మాఫియా వార్నింగ్

by Dishafeatures2 |
అడ్డొస్తే పైనుంచి ట్రాక్టర్ ఎక్కిస్తాం.. ఇసుక మాఫియా వార్నింగ్
X

దిశ, తాండూరు రూరల్: అధికారం మాది.. అడ్డుకునేది ఎవరు.. అన్న రీతిలో నిబంధనలు.. నమ్మకాలతో సంబంధం లేకుండా ఇసుక అక్రమార్కులు దోపిడీనే పరమావధిగా చెలరేగిపోతున్నారు. చేతనైంది చేసుకోండి.. తవ్వకాలు మాత్రం ఆపేదిలేదంటూ బరితెగిస్తున్నారు. అధికారులను బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎవరైనా ఇదేంటి అని ప్రశ్నిస్తే.. అడ్డొస్తే పైనుంచి ట్రాక్టర్ ఎక్కిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికారులు ఎంత అడ్డుకట్ట వేసినా ఆగడాలు ఆగడం లేదు. దీనికి తోడు కొందరు రాజకీయ నాయకులకు ప్రత్య క్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉండటంతో నిజాయితీపరులైన అధికారులు కూడా చూసీచూడనట్లు పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎవరైనా ఆపేందుకు ప్రయత్నం చేసినా.. అడ్డుకున్నా.. అధికారులనే మందలించే దురదృష్టకర పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు కింది స్థాయి అధికారులను బెదిరించడంతో ఇసుకను పట్టుకునేందుకు జంకుతున్నారు.మరోవైపు పోలీసుల కనుసన్నల్లోనే ఈ దందా సాగుతుందనే ఆరోపణలున్నాయి.

పోలీసుల పై దాడులకు వెనుకాడని మాఫియా..

ఇసుక అక్రమ రవాణాకు అడ్డువస్తున్న వారికి మొదట డబ్బులు ఎరవేయడం... లేదంటే దాడులు చేయడానికి కూడా వెనుకాడడంలేదు.2022 డిసెంబర్ నెలలో బషీరాబాద్ మండలం ఇందర్ చెడ్ సమీపంలో ఇసుక ట్రాక్టర్ ను ఆపే ప్రయత్నంలో కానిస్టేబుల్ శంకర్ శివరామ్ ను ట్రాక్టర్ ఢీకొనడంతో అతడి రెండు కళ్లు విరిగిన విషయం తెలిసిందే. నెల రోజుల క్రితం యాలాల మండలంలో ఒక గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత కొడుకు ఇసుక వ్యవరంలో పోలీసుల పై దురుసుగా ప్రవర్తించి చెయ్యి చేసుకున్నాడని సమాచారం.అధికార పార్టీ నేత కొడుకు కావడంతో, అధికార పార్టీ బడా నాయకులు ఈ కొడవను బట్ట బయట కాకుండా అంతటితో ముగించినట్టు విశ్వాసనీయ వర్గాల సమాచారం.

100కు దయల్ చేసిన శూన్యం..

అక్రమ ఇసుక దందాకు కొందరి అధికారుల ప్రస్తావంతోనే కొనసాగుతుంది. మర్చి నెలలో బషీరాబాద్ మండలం ఎక్మై గ్రామస్తులు మా శివారుల్లో ఇసుక రవాణా జోరుగా సాగుతుందని 100కు డయల్ చేసిన చెప్పిన కూడా ఎలాంటి ఫలితం లేదు. ఇద్దరు పోలీసులు వచ్చి వెళ్లిపోయారు. దీంతో అక్రమార్కులకు పోలీసుల నుండి సమాచారం చేరవేశారని అనుమానాలు వినిపిస్తున్నాయి. ఎవరైనా అక్రమ ఇసుక రవాణా పై ఫిర్యాదు చేస్తే పలని వారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఇసుక మాఫియాకు కొందరు పోలీసులు, వీఆర్వోలు సమాచారం అందిస్తున్నట్లు స్థానికులుఆరోపిస్తున్నారు. దీంతో ఇసుక మాఫియా వారిపై దాడులకు సైతం లెక్కచేయకుండా, బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.



Next Story

Most Viewed