పోక్సోకేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి జీవితఖైదు సహా..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-08-20 08:05:15  IST  )

తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు (Pocso Court) సంచలన తీర్పు వెలువరించింది.

పోక్సోకేసులో రంగారెడ్డి కోర్టు సంచలన తీర్పు.. నిందితుడికి జీవితఖైదు సహా..
X

దిశ, వెబ్ డెస్క్: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు (Pocso Court) సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడైన ఆటో డ్రైవర్ కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. అలాగే రూ.55 వేల జరిమానా విధించింది. అలాగే బాధితురాలికి జడ్జి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేశారు. 2022లో ఆటో డ్రైవర్ సలీమ్ తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ ఏడాది జూన్ నెలలో ఎల్బీనగర్ లో బాలికపై ఈ దారుణ ఘటన జరిగింది. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు సలీమ్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో కేసు నమోదు చేశారు. మూడేళ్ల దర్యాప్తు తర్వాత నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష పడింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి మృగాళ్ల పనిపట్టేందుకు మరిన్ని కఠిన చట్టాలు అమల్లోకి తీసుకురావాలని ఆడపిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Next Story