- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ మొదలైన పెట్రోల్, డీజిల్ కష్టాలు
మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లే రహదారి పై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

దిశ, రాజేంద్రనగర్ : మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వెళ్లే రహదారి పై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పెట్రోల్, డీజిల్ నిల్వలు నిండుకోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇచ్చాయి. ఇక స్టాక్ ఉన్న చోట కిలోమీటర్ వరకు ఆటోలు, వాహనదారులు బారులు తీరారు.
ఇంధనం కోసం గంటల తరబడి ఎదురుచూడటంతో రహదారి పై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు తమ గమ్యస్థానాలకు చేరుకోలేక నడిరోడ్డుపైనే అవస్థలు పడ్డారు. పెట్రోల్ కొరత ప్రభావం సామాన్య ప్రయాణికుల పై తీవ్రంగా పడింది. ఎండ తీవ్రతకు తోడు వాహనాలు కదలకపోవడంతో చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. అధికారులు స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని జనం కోరుతున్నారు. పరిస్థితి చక్కబడే వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే మంచిదని వాహనదారులు ఒకరికొకరు చర్చించుకుంటున్నారు.






