- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ ఇసుక ఫిల్టర్ల పై కొరడా
by Batti.Sumithra |
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి, కేశంపేట మండలాల శివారు ప్రాంతాలైన పడకల్, చౌలపల్లి గ్రామాలలో అక్రమంగా ఇసుక తయారు చేస్తున్న రెండు ఫిల్టర్స్ ను అధికారులు ధ్వంసం చేశారు.

X
దిశ, తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి, కేశంపేట మండలాల శివారు ప్రాంతాలైన పడకల్, చౌలపల్లి గ్రామాలలో అక్రమంగా ఇసుక తయారు చేస్తున్న రెండు ఫిల్టర్స్ ను అధికారులు ధ్వంసం చేశారు. బుధవారం తలకొండపల్లి డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో అధికారులు అక్రమ ఇసుక ఫిల్టర్లపై కొరడా జులిపించారు.
తరలించడానికి సిద్ధంగా ఉన్న ఇసుక కుప్పలను అధికారులు జేసీబీ తో వాగులోకి తోశారు. ఇకముందు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ మంజుల, హెడ్ కానిస్టేబుల్ నరసింహులు శెట్టి, కానిస్టేబుల్ విట్టలయ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story






