ఎయిర్ పోర్టులో మాక్ డ్రిల్

by Nallavelli.Anjaneyulu |

జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ( ఎండిఎంఏ) ఆధ్వర్యంలో బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.

ఎయిర్ పోర్టులో మాక్ డ్రిల్
X

దిశ‌, శంషాబాద్ : జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ( ఎండిఎంఏ) ఆధ్వర్యంలో బుధవారం శంషాబాద్ విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఇంధన కేంద్రం సమీపంలో విమానాశ్రయం వెనుక అగ్నిప్రమాదం జరిగింది. దీంతో వెంటనే ఎన్ డి ఆర్ ఎఫ్, అగ్నిమాపక శాఖ, అటవీ శాఖ, రెవెన్యూ శాఖ, జిహెచ్ఎంసి స్థానిక పోలీసులు, సిఐఎస్ఎఫ్, జీఎన్ఆర్ అగ్నిమాపక విభాగం, వైద్య, రవాణా శాఖ అధికారులతో ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. ఎలాంటి అపశృతికి తావు లేకుండా పూర్తి చేయడంతో ఆయా విభాగాల అధికారులు అభినందించారు. కార్యక్రమంలో శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ కనకయ్య సంపతి, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Next Story