రేపు కాడ్లాపూర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాక

by Ratna Kumari |

పారిశ్రామిక వాడ కోసం కాడ్లాపూర్ గ్రామ శివారులో భూములు కోల్పోతున్న రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు వస్తున్నట్లు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు.

రేపు కాడ్లాపూర్ కు ఎమ్మెల్యే హరీష్ రావు రాక
X

దిశ, పరిగి : పారిశ్రామిక వాడ కోసం కాడ్లాపూర్ గ్రామ శివారులో భూములు కోల్పోతున్న రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పించేందుకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు వస్తున్నట్లు పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు. పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామంలో పారిశ్రామిక వాడ కోసం చేపట్టిన నిరవధిక దీక్షకు, గ్రామ రైతులకు మద్దతు పలికేందుకు బుధవారం విచ్చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులు అందుబాటులో ఉండి సమస్యను హరీశ్ రావుకు తెలియజేయాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై హరీష్ రావు సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Next Story