పేదింటి బిడ్డకు ఎంబిబిఎస్ సీట్

by Elthuri vijay kumar |

ఫరూఖ్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్డి రవీందర్ మరియు దొడ్డి లక్ష్మి పెద్ద కుమారుడు దొడ్డి జ్ఞాని నాని 2025 మెడికల్ ఎంట్రన్స్ లో ఉత్తీర్ణత సాధించి కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ సీటును సాధించాడు,

పేదింటి బిడ్డకు ఎంబిబిఎస్ సీట్
X

పేదింటి బిడ్డకు ఎంబీబీఎస్ సీట్

- కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్రీ సీటు సాధించిన దొడ్డి జ్ఞాని

దిశ,షాద్ నగర్ : వెలిజర్ల గ్రామానికి చెందిన పేదింటి బిడ్డకు నీట్ 2025 ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫ్రీ ఎంబీబీఎస్ సీటును సాధించాడు, వివరాలకు వెళితే ఫరూఖ్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దొడ్డి రవీందర్ మరియు దొడ్డి లక్ష్మి పెద్ద కుమారుడు దొడ్డి జ్ఞాని నాని 2025 మెడికల్ ఎంట్రన్స్ లో ఉత్తీర్ణత సాధించి కామారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబిబిఎస్ సీటును సాధించాడు. తన తండ్రి ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తూ, కొడుకుని ఎంబిబిఎస్ డాక్టర్ చేయాలనే తన తండ్రి కలను నిజం చేస్తూ దొడ్డి జ్ఞాని మెడికల్ సీట్ సాధించి తన తండ్రికి మెడికల్ సీటు రూపంలో గిఫ్ట్ ఇచ్చి వారి కుటుంబంలో ఆనందాన్ని నింపాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన చేసిన దొడ్డి జ్ఞాని, వెలిజర్లలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు, తర్వాత రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం లోని కొందుర్గు గురుకుల పాఠశాలలో ఆరో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసాన్ని కొనసాగించారు, అనంతరం ప్రభుత్వ గురుకుల పాఠశాల చిలుకూరు లో ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే నీట్ ఎంట్రెన్స్ కోచింగ్ తీసుకొని, కామారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఫ్రీ వైద్య సీటును సాధించి, ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు తక్కువేం కాదంటూ జ్ఞాని నిరూపించాడు, కుటుంబం పేదరికంలో ఉన్నప్పటికీని మొక్కవోని దీక్షతో పట్టుదలతో తండ్రి కలను సహకారం చేస్తూ, వైద్య (MBBS) సీట్ సాధించటం ఆ కుటుంబం సంతోషించే విషయం, అంతేకాకుండా EAPCET లోను 800 రాష్ట్రస్థాయి ఉన్నత ర్యాంకులు సాధించి అందులో కూడా అర్హత సాధించాడు, వైద్య సీటు వస్తుందన్న నమ్మకంతో బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ సైన్స్ ,తదితరుల కోర్సుల కౌన్సిలింగ్ జ్ఞాని హాజరు కాలేదు, నీట్ 2025 ఎంట్రెన్స్ క్వాలీఫై అయ్యి MBBS సీటు సాధించిన దొడ్డి జ్ఞానిని కుటుంబ సభ్యులు తోపాటు స్నేహితులు, వారి బంధువులు అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా జ్ఞాని మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో కష్టపడి ఇష్టంతో చదివితేనే ఏదైనా సాధించగలమని నాని తెలిపారు.

Next Story