పలు అంతర్జాతీయ విమానాలు రద్దు

by Jakkula.Mamatha |

ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పలు అంతర్జాతీయ విమానాలు రద్దు
X

దిశ,శంషాబాద్: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అంతర్జాతీయ విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి దుబాయ్, దోహా, కువైట్, ద మామ్, సౌదీ అరేబియా, షార్జా, అబుదాబి, జెడ్డా, మస్కట్ దేశాలకు వెళ్ళవలసిన 23 విమాన సర్వీసులు రద్దు, అలాగే ఆయా ప్రాంతాల నుంచి రావాల్సిన 21 విమాన సర్వీసులు కూడా రద్దు అయినట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టు వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు.

Next Story