ప్రారంభం కానున్న మైసిగండి మైసమ్మ తల్లి జాతర

by Batti.Sumithra |

రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈ నెల 5 తేదీ నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో స్నేహలత తెలిపారు.

ప్రారంభం కానున్న మైసిగండి మైసమ్మ తల్లి జాతర
X

దిశ, కడ్తాల్ : రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన మైసిగండి మైసమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈ నెల 5 తేదీ నుంచి 10 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో స్నేహలత తెలిపారు. మండలంలోని మైసమ్మ తల్లి జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చేసినట్లు ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఆర్.లక్ష్మీ శిరోళీ పంతు నాయక్, ఈవో స్నేహలత పేర్కొన్నారు. జాతర మహోత్సవానికి విచ్చేసి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలను ఘనంగా జరుపుటకు ముందస్తు చర్యలు చేపట్టామని, జాతర మహోత్సవ ప్రత్యేక కార్యక్రమాలు బుధవారం కార్తీక పౌర్ణమి అమ్మవారికి క్షీరాభిషేకం అమ్మ హారతి విశేషాలు అలంకరణలతో ప్రారంభమై, గురువారం సహస్ర చండీయాగం, చిన్నతేరు, శుక్రవారం సహస్ర చండీయాగం, పెద్దతేరు, శనివారం సహస్ర చండీయాగం పూర్ణహుతి, ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పించడం, బండ్లు తిప్పుట, సోమవారం అమ్మవారి కూరగాయలలో ప్రత్యేక అలంకరణ వివిధ ప్రత్యేక పూజకార్యక్రమంతో ముగుస్తాయని జాతర మహోత్సవంలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.

భక్తుల అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేశాం : ఈవో స్నేహలత

ఈనెల ఐదు నుంచి 10వ తేదీ వరకు జరగనున్న మైసమ్మ తల్లి జాతర మహోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు అన్ని సౌకర్యాలు ముందుగానే ఏర్పాటు చేశామన్నారు. 5 రోజుల పాటు కొనసాగే జాతర మహోత్సవాలకు ఆలయ ప్రాంగణం ప్రత్యేక శోభనీయంగా అలంకరణలతో ముస్తాబుతో మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, జాతర మహోత్సవాలకు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేయాలన్నారు.

కొలిచిన వారికి కొంగుబంగారం మైసమ్మ తల్లి ఆలయం.. ఆలయ ఫౌండర్ ట్రస్టీ ఆర్.లక్ష్మీ శిరోళీ పంతు నాయక్

దశాబ్దాల కాలం నుంచి మైసమ్మ తల్లి ఆలయానికి విచ్చేసిన భక్తులకు కొలిచేవారికి కొంగుబంగారంగా కోరికలు తీరుస్తూ అమ్మవారు రాష్ట్రంలోనే ప్రత్యేక ప్రసిద్ధి పొందిందని అన్నారు. పూర్వ చరిత్రలోనే పూజలు నిర్వహించినట్లు పూర్వీకులు తెలిపారన్నారు. అనంతరం పురాతన ఆలయాన్ని అభివృద్ధి పరిచేందుకు ఆమనగల్లు మాజీ ఎంపీపీ ఆర్ పంతు నాయక్, దాతల సహకారంతో ఆలయ అభివృద్ధికి స్వీకారం చుట్టగా సుమారు గత 23 సంవత్సరాలుగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఆలయ అభివృద్ధితో ముందుకు వెళ్తుందన్నారు. అమ్మవారి అమ్మవారు ఆశీర్వచనం, కృప, ప్రతిమతోనే ఇదంతా సాధ్యమవుతుందని తెలిపారు.

Next Story