కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి: సబితా ఇంద్రారెడ్డి

by Disha Web Desk 11 |
కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి: సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, గండిపేట్:- కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహాక ప్రక్రియలో భాగంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అధ్యక్షతన రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కాసాని జ్ఞానేశ్వర్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలతో మమేకం అయిన ఒక మంచి వ్యక్తి...జడ్పీ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా ఈ ప్రాంతానికి సేవ చేశారని, బడుగు బలహీన వర్గాల గొంతుకగా జ్ఞానేశ్వర్ వాణి పార్లమెంట్ లో వినిపించేలా చేద్దాం అన్నారు. 96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి అందరి ఐక్యతకు పాటు పడ్డారని కొనియాడారు.

నేడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోతే ప్రస్తుత ఎంపీ కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లారని, నాడు ఈ ప్రాంత ప్రజలకు తెలియని రంజిత్ రెడ్డిని కేసీఆర్ చెప్పారని ఎంపీగా బీఆర్ఎస్ కారు గుర్తుతో గెలిచిన వారు ఇపుడు మనకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారని వారికి ఈ ప్రాంత ప్రజలు ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.కేసీఆర్ కుటుంబ ఇబ్బందులో ఉన్నప్పుడు పార్టీ వదిలి వెళ్తున్నారు. తెలంగాణ ప్రజలు వారిని వూరికే వదలరు. తెలంగాణ ప్రజలకు 24గంటల కరెంట్ అందించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుంది.

కేసీఆర్ ఆపదలో ఉన్నప్పుడు ఆయనను గట్టెకించేది కార్యకర్తలు మాత్రమే అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీలు సురభి వాణీ దేవి, యెగ్గే మల్లేశం, దయనంద్ గుప్తా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రామేశ్వరం నర్సింహ, గణేష్ గుప్తా, నాగేష్ యాదవ్, వెంకటేష్, బి విష్ణు, రాజు, యాదయ్య, బక్కని సాయి, బెంజమిన్, విక్రమ్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed