పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధికి నాంది : కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

by Disha Web Desk 20 |
పరిశ్రమల ఏర్పాటుతో అభివృద్ధికి నాంది : కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
X

దిశ, తలకొండపల్లి : గ్రామీణ ప్రాంతాలలోని పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. మండలంలోని జంగారెడ్డిపల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఇటీవల నూతనంగా సుమారు 20 కోట్ల రూపాయలతో విష్ణు సహస్ర అగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు కేఎస్ఎన్ రాజు, కె.రంగ రాజులు కోళ్ల పరిశ్రమ కోసం ఫీడ్ తయారు చేయడానికి ప్రత్యేకంగా ఫ్యాక్టరీ నిర్మించారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి శనివారం కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి, జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్, రాష్ట్ర భరసా నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, వైఎస్ఆర్టీపీ ఇంచార్జ్ అర్జున్ రెడ్డిలు హాజరై పరిశ్రమను ఘనంగా ప్రారంభించారు.

అనంతరం నేతలు మాట్లాడుతూ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన జంగారెడ్డిపల్లి గ్రామ సమీపంలో పౌల్ట్రీ ఫారమ్స్ కు సంబంధించిన దాన సరఫరా చేసే పరిశ్రమను నెలకొల్పడం ఎంతో శుభసూచకమని వారు అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల గ్రామాల అభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని కోళ్ల పరిశ్రమలు ఎక్కువగా మన ప్రాంతంలోనే ఉన్నాయని వారు పేర్కొన్నారు. నూతనంగా పరిశ్రమలు ఏర్పాటు విషయంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ వారికి బాసటగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, రఘు రాములు, మాజీ జెడ్పిటిసి పద్మ నరసింహ, సర్పంచులు వరలక్ష్మీ రాజేందర్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, ధరణి శివశంకర్ రెడ్డి, లక్ష్మణ్, జయమ్మ వెంకటయ్య, చంద్రయ్య ,శ్రీశైలం, రఘుపతి, లలిత జ్యోతయ్య, నాగమణి లింగం గౌడ్, ఎంపీటీసీ సరిత గణేష్, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ యాదయ్య,ఆయా గ్రామాల నాయకులు శ్రీశైలం యాదవ్,దేవుల,శేఖర్, పాండు నాయక్, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed