- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాటర్ ట్యాంక్ కు మూత ఏర్పాటు చేయండి
శివ నారాయణపురం కాలనీలో వాటర్ ట్యాంక్ లోకి మురికి నీరు చేరి ట్యాంక్ మూత శిథిలావస్థకు చేరిందని వెంటనే మరమత్తులు చేపట్టాలని బడంగ్ పేట్ బీజేపీ అధ్యక్షుడు రాళ్ళ గూడెం రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, మీర్ పేట్ : శివ నారాయణపురం కాలనీలో వాటర్ ట్యాంక్ లోకి మురికి నీరు చేరి ట్యాంక్ మూత శిథిలావస్థకు చేరిందని వెంటనే మరమత్తులు చేపట్టాలని బడంగ్ పేట్ బీజేపీ అధ్యక్షుడు రాళ్ళ గూడెం రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం బడంగ్ పేట్ సర్కిల్ పరిధిలోని శివ నారాయణపురం కాలనీలో స్థానికుల తో కలిసి ఆయన వాటర్ ట్యాంక్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమస్యలు చెరువుల్లోకి మురికినీరు చేరి తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోందని, కాలనీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయం ప్రధాన కార్యాలయం వద్ద కూడా తీవ్రమైన డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో బడంగ్ పేట్ ప్రభుత్వ పాఠశాల లో ఇదే తరహా సమస్య ఏర్పడినప్పుడు, ఆ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే సమస్య పరిష్కారం చేశారని గుర్తు చేశారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.ఈ కార్యక్రమంలో శివ నారాయణపురం కాలనీవాసులు, బీజేపీ నాయకులు చిత్రం శ్రీనివాస్ మల్లేష్ దీక్షిత్ పవన్ కిరణ్ పాల్గొన్నారు.






