ఐకేపీ వీవోఏలు స‌మ్మెలో భాగంగా వంట‌వార్పు

by Ratna Kumari |

వీవోఏల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చేవెళ్ల పట్టణ కేంద్రంలో ప్రారంభమైన వీవోఏల సమ్మె నేటికీ 13వ రోజుకు చేరుకుంది.

ఐకేపీ వీవోఏలు స‌మ్మెలో భాగంగా వంట‌వార్పు
X

దిశ‌, చేవెళ్ల : వీవోఏల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చేవెళ్ల పట్టణ కేంద్రంలో ప్రారంభమైన వీవోఏల సమ్మె నేటికీ 13వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, ఐకేపీ వీవోఏ మండల సలహాదారులు చంద్రశేఖర్ మాట్లాడుతూ వీవోఏల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా వివిధ రూపాలలో సమస్యలను విన్నవించామని అయినా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. వీవోఏ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా చేవెళ్ల పట్టణ కేంద్రంలో సమ్మె నిర్వహిస్తున్నామని అన్నారు.


కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో వివోఏలకు అనేక హామీలు ఇచ్చిందని ప్రభుత్వం ఏర్పడి 28 నెలలు పూర్తయిన నేటికీ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదని అన్నారు. ప్రభుత్వం వెంటనే కనీస వేతనం 26 వేలు నిర్ణయించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, అర్హులైన వివో ఏ లను సీసీలుగా పదోన్నతి కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ప్రమాద బీమా కల్పించాలని సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సంఘం చేవెళ్ల మండల అధ్యక్షురాలు కవిత ప్రధాన కార్యదర్శి ఆలూరు ప్రమీల, కోశాధికారి జ్యోతి వీవోఏ లు శంకర్, రమేష్,సుజాత ప్రేమలత అమృత నిర్మల సల్మా అస్రా బేగం లలిత స్వప్న హేమలత కవిత లలిత సుశీల పాల్గొన్నారు.

Next Story