వేరుశనగ విత్తనాల పంపిణీలో భారీ గోల్‌మాల్?

by Naga Rani Yarlagadda |

కేంద్రప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న NMEOO-OS పథకం కింద సరఫరా అయిన వేరుశనగ విత్తనాల పంపిణీ వ్యవహారం వికారాబాద్ జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది.

వేరుశనగ విత్తనాల పంపిణీలో భారీ గోల్‌మాల్?
X

దిశ, కొడంగల్ : కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్న ఎన్‌ఎంఈఓఓ-ఓఎస్ (NMEOO-OS) పథకం కింద సరఫరా అయిన వేరుశనగ విత్తనాల పంపిణీ వ్యవహారం వికారాబాద్ జిల్లాలో తీవ్ర దుమారం రేపుతోంది. జిల్లాలోని 8 మండలాలకు గానూ మొత్తం 3,375 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం కేటాయించింది. యాలాల మినహా బషీరాబాద్, కొడంగల్, బొంరాస్‌పేట్, దోమ, కుల్కచర్ల, దౌల్తాబాద్ తదితర మండలాల్లో ఈ విత్తనాల పంపిణీ జరిగింది. అయితే ఈ పంపిణీ ప్రక్రియ మొత్తం అవినీతి అక్రమాలకు కేరాఫ్ అడ్ర స్‌గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. దౌల్తాబా ద్ మండలంలో జరిగిన విత్తనాల గోల్‌మాల్‌పై ‘దిశ’ పత్రిక ఆధారాలతో సహా ప్రచురించిన కథనానికి జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ స్పందించారు. ఈ స్కామ్ కేవలం ఒక మండలానికే పరిమితం కాలేదని భావించిన కలెక్టర్ జిల్లాలో వేరుశనగ విత్తనాల పంపిణీ జరిగిన అన్ని మండలాల్లో సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జిల్లా వ్యవసాయ అధికారిని వారం రోజుల క్రిత మే ఆదేశించారు. అయితే వారం రోజులు గడు స్తున్నా క్షేత్రస్థాయిలో విచారణ ఊసే లేకపోవడం పై పలవురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకీ తాత్సారం?

కలెక్టర్ ఆదేశాల ప్రకారం డీఏవో తక్షణమే క్షేత్ర స్థాయికి వెళ్లి, విత్తనాలు పంపిణీ జరిగిన గ్రామా ల్లో నేరుగా రైతులను కలిసి విచారించాల్సి ఉంది. కానీ, కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి వారం రోజులు గ డుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి గ్రౌండ్ లెవెల్ పరిశీలన జరగకపోవడం గమనార్హం. కేవలం కా ర్యాలయాలకే పరిమితమై, రికార్డులను తిరగే స్తూ.. కాగితాల సర్దుబాటుతోనే కాలయాపన చే స్తున్నట్లు తెలుస్తోంది.

అసలు ప్రశ్న ఇదే!

కలెక్టర్ ఆదేశించి వారం రోజులవుతున్నా ఎందు కు విచారణ ప్రారంభించలేదు? ఈ జాప్యం వెను క ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి? కలెక్టర్ ఆదేశాలనే బేఖాతరు చేస్తూ అవినీతి అధికారులను కాపాడేందుకు తెరవెనుక సూత్రధారులు చక్రం తిప్పుతున్నారా? విచారణను నీరుగార్చి తూతూమంత్రంగా నివేదిక ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

3,375 క్వింటాళ్ల కేటాయింపు.. అంతా మాయాజాలం!

జిల్లాలోని 8 మండలాలకు గానూ మొత్తం 3,37 5 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను ప్రభుత్వం కే టాయించింది. ఈ విత్తనాల పంపిణీ జరిగింది. అసలు విత్తనాలే అందలేదని రైతులు నెత్తీనోరూ బాదుకుంటుంటే.. రికార్డుల్లో మాత్రం వారికి విత్తనాలు పంపిణీ చేసినట్లు బోగస్ లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఒకటి ఇచ్చి.. రెండు రాసి! కొంతమంది రైతులకు కేవలం 1 క్వింటాల్ విత్తనాలు ఇచ్చి, రికార్డుల్లో మాత్రం 2 క్వింటాళ్లు ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు రాశారు. మిగిలిన వి త్తనాల కోటాను నల్లబజారుకు తరలించి సొమ్ము చేసుకున్నట్లు బలమైన ఆధారాలు కనిపిస్తున్నా యి. ఈ నేపథ్యంలోనే కలెక్టర్ దీపక్ తివారీ.. పం పిణీ జరిగిన ప్రతి మండలంపై విడివిడిగా సమగ్ర నివేదిక సమర్పించాలని స్పష్టం చేసినా, వారం రోజులుగా వ్యవసాయ శాఖ అధికారులు కదలకపోవడం వెనుక పెద్ద తిమింగలాలే ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

విచారణ పక్కదారి పడితే ఊరుకోం! రైతాంగం హెచ్చరిక!

గతంలోనూ ఇలాంటి అక్రమాలు జరిగినప్పుడు విచారణల పేరుతో కాలయాపన చేసి ఫైళ్లను అటకెక్కించారని రైతులు మండిపడుతున్నారు. కలెక్ట ర్ ఆదేశించి వారం రోజులైనా అధికారులు క్షేత్రస్థాయికి రాకపోవడమే దీనికి నిదర్శనమని ధ్వజమెత్తుతున్నారు. ఈసారైనా జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ స్వయంగా రంగంలోకి దిగి, అధికారుల కాగితపు నివేదికలను నమ్మకుండా.. థర్డ్ పార్టీతో ఫిజికల్ ఆడిట్ (క్షేత్రస్థాయి తనిఖీ) చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. పంపిణీ జరిగిన మం డలాల్లోని ప్రతి రైతునూ కలిసి స్టేట్‌మెంట్ రికా ర్డు చేయాలని, అక్రమార్కులతో చేతులు కలిపిన అధికారులను సస్పెండ్ చేయాలని బాధిత రైతు లు డిమాండ్ చేస్తున్నారు.

Next Story