- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇంటి ప్రారంభోత్సవం.. మహిళా సర్పంచ్‌కు ఘోర అవమానం
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో మహిళా సర్పంచ్‌కు ఘోర అవమానం జరిగింది.

దిశ, ఇబ్రహీంపట్నం : ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో మహిళా సర్పంచ్‌కు ఘోర అవమానం జరిగింది. ప్రోటోకాల్ పాటించకుండా మహిళా సర్పంచ్‌ను కాలితో తన్ని, ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన వ్యక్తి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత సర్పంచ్ సోమవారం జిల్లా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి గ్రామ సర్పంచ్ లక్కుమల్ల ఉమయాదయ్య ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం గ్రామంలో అధికారిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, అధికారులు హాజరై పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు.
కాగా, ఎమ్మెల్యేకు పక్క గ్రామాల్లో కూడా కార్యక్రమాలు ఉండటంతో సమయం తక్కువగా ఉండటంతో, గ్రామంలో మిగిలిన అభివృద్ధి పనుల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవాన్ని సర్పంచ్ లక్కుమల్ల ఉమ యాదయ్య చేయాలని సూచించారు. ఈ క్రమంలో సర్పంచ్ ప్రారంభోత్సవం చేస్తుండగా, గ్రామానికి చెందిన ఏర్పుల సంజీవ్ కుమార్ ఆమెను కాలితో తన్ని, చేతిలోని కత్తెరను లాక్కొని స్వయంగా ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించాడు. ఈ ఘటనతో సర్పంచ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. గ్రామస్తుల సమక్షంలో మహిళా సర్పంచ్‌కు జరిగిన ఈ అవమానం తీవ్ర ఆవేదన కలిగించింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ “ప్రోటోకాల్ పాటించకుండా నా విధులకు భంగం కలిగించి, గ్రామస్తుల ముందు నన్ను అవమానించిన వ్యక్తి పై పూర్తి విచారణ జరిపి, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. నాకు న్యాయం చేయడంతో పాటు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలి” అని కోరారు.






