అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు.. రాష్ట్రంలో దయనీయ పరిస్థితి

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వ కార్యాలయం అంటే ప్రతిష్టాత్మకంగా ప్రజలకు కనిపిస్తోంది. అలాంటి కార్యాలయాలను ప్రజస్వామ్యంలో చులకన చేసే దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి.

అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు.. రాష్ట్రంలో దయనీయ పరిస్థితి
X

దిశ, రంగారెడ్డి బ్యూరో: ప్రభుత్వ కార్యాలయం అంటే ప్రతిష్టాత్మకంగా ప్రజలకు కనిపిస్తోంది. అలాంటి కార్యాలయాలను ప్రజస్వామ్యంలో చులకన చేసే దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి. యేండ్ల తరబడి కొన్ని కార్యాలయాలను అద్దె భవనాల్లో నడిపించి, సకాలంలో చెల్లించకపోవడంతో యజమానులు తాళాలు వేయడంతో నవ్వుల పాలవుతున్న సందర్భాలు అనేకం. పైసా ఆదాయం రాకుండా ప్రజా సంక్షేమం కోసం ఏర్పాటయ్యే కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉన్నాయంటే ఆలోచించాల్సిందే. కానీ ఆదాయం తెచ్చిపెట్టే కొన్ని శాఖల కార్యాలయాలు అద్దె భవనంలో ఉండడం విడ్డూరం. రాష్ట్రానికి అత్యంత ఆదాయం సమకూర్చే శాఖల్లో రిజిస్ట్రార్​, ఎక్సైంజ్​ ప్రధానమైనవి. ఈ శాఖల కార్యాలయాలు కూడా అద్దె భవనాల్లో నడపడం దారుణం. అంతేకాకుండా మండలాల్లో ప్రధాన వనరుగా ఉండే రెవెన్యూ కార్యాలయాలు సైతం అద్దే భవనాల్లోనే కొనసాగుతున్నాయి. పలు మండలాల్లో సొంత భవనాలున్నప్పటికీ శిథిలావస్థలో ఉండి వానకు తడిసి, ఎండకు ఎండిపోవడంతో అధికారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లాకు ప్రధాన ఆదాయ వనరుగా చెప్పుకుంటారు. అంతేకాకుండా బడా వ్యాపార సంస్థలు, నాయకుల నుంచి చిన్న స్థాయి వరకు అవసరమైన పనులు చేసిపెట్టడంలో కీలకపాత్ర పోషిస్తోంది. అలాంటి జిల్లాలో కూడా ప్రభుత్వ శాఖలకు పక్క భవనాలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అనే చందంగా ఉందనే చర్చ సాగుతుంది.

కొత్త మండలాల్లో అదే పరిస్థితి..

జిల్లాలో ఏర్పడిన కొత్త మండలాల్లో పక్క భవనాలు లేకపోవడంతో సింగిల్​ బెడ్​రూం, డబూల్ బెడ్​ రూం గదుల్లో నడుస్తోంది. ఆఫీస్ లుక్​ లేకుండా ఓ ఇంటిలో ఫ్యామిలీ ఉండేలా ప్రభుత్వ శాఖలను కొనసాగించడంతో ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడిపించడంతో భద్రత కరువైంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పక్కా భవనాలు నిర్మిస్తే ప్రజల్లో గౌరవం పెరిగే అవకాశం ఉంది.

నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్​లో సైతం అధికారులకు, సిబ్బందికి తగ్గట్టుగా గదులు లేకపోవడం, సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వైనం నిత్యం కనిపిస్తోంది. ఇబ్రహీంపట్నం డివిజన్​పరిధిలో స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు పక్క ప్లానింగ్​తో ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. అదే పద్ధతిలో అన్ని డివిజన్లలో కార్యాలయాలు ఉంటే మరింత గౌరవం ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా ఏర్పడిన మండలాల్లో రెవెన్యూ అగ్రికల్చర్, ఎంపీడీవో, ఎంఈవో, పోలీస్​స్టేషన్లు సైతం అద్దె భవనాల్లోనే కొనసాగడం విడ్డూరంగా ఉంది.

ఈ శాఖపై చిన్న చూపా..

రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో అత్యధిక ఆదాయం సంపాదించే రిజిస్ట్రార్​శాఖపై చిన్న చూపు ఎందుకు? ప్రతి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం హుండీలో భక్తులు వేసే నగదులాగా సబ్​రిజిస్ట్రార్​కార్యాలయం ప్రభుత్వానికి ఆసరాగా పనిచేస్తుంది. అలాంటి శాఖలకు పక్కా భవనాలు నిర్మించకపోవడంతో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అద్దెలు చెల్లించిన నగదుతో ఎప్పుడో కొత్త భవనాలు నిర్మించే అవకాశం ఉంది. కానీ ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఏ ఉద్దేశ్యంతో జిల్లాలోని రిజిస్ట్రార్, సబ్​రిజిస్ట్రార్​కార్యాలయాల నిర్మాణానికి ప్రోత్సాహం చూపించడం లేదో తెలియడం లేదని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. రిజిస్ట్రార్​ శాఖలో రిజస్ట్రేషన్​కోసం వేళ్లే ప్రజలకు కూడా విశ్రాంతి గదులు, కూర్చుకునేందుకు స్థలం లేని కార్యాలయాలు అనేకం జిల్లాలో ఉన్నాయి. ప్రజలు ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే కార్యాలయాల్లో కనీస మర్యాదలు లేకపోవడం గమనార్హం.

అద్దె చెల్లించకపోవడంతో తాళాలు

ఒక్క నెల, రెండు నెలలు.. మరో ఆరు నెలలు ఇంటి యాజమాని ప్రభుత్వంపై ఉన్న గౌరవంతో అద్దె ఇవ్వకపోయిన ఓపికతో ఉంటాడు. అంతేకాకుండా ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా ప్రభుత్వం అద్దె చెల్లిస్తుందనే నమ్మకంతో యజమాని సహనం పాటిస్తాడు. కానీ యేండ్లకు యేండ్లుగా అద్దె చెల్లించకుండా ఇంటి యాజమానిని ఇబ్బందులకు గురిచేస్తే అన్ని నెలలు సహనం, ఓపికతో వ్యవహరించి ప్రజల సమక్షంలో తాళాలు వేసే దౌర్భగ్య పరిస్థితిని అధికారులు కల్పించడం దారుణం. ప్రభుత్వం పన్నులు, జరిమానా, వివిధ పద్ధతుల్లో సకాలంలో చెల్లించని యెడల ఎంత కఠినంగా వ్యవహరిస్తోంది. అదే ప్రభుత్వ అధికారులు కార్యాలయాలను అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయడం ఎంత వరకు సబబు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు స్థలం కరువైపోయింది. ప్రైవేట్​ వ్యక్తులు ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకునేందుకు అందుబాటులో ఉండడం విశేషం. దీంతో ప్రజలకు ప్రభుత్వంపై ఉండే గౌరవ మర్యాదలు పాడయ్యే పరిస్థితి నెలకొటుంది. జిల్లాలో కొత్త ఏర్పాటైన మండలంలో చౌదరిగూడ ఒకటి. ఈ మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. తొమ్మిదేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో నాలుగు నెలల క్రితం కార్యాలయానికి తాళం వేశారు. అబ్ధూల్లాపూర్​మెట్ సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయం అద్దె భవనంలో నడుస్తోంది. మూడేళ్లుగా అద్దె చెల్లించకపోవడంతో యాజమాని తాళాలు వేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయి.

Next Story