- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆధునిక సాంకేతికతను యువత సద్వినియోగం చేసుకోవాలి
ఆధునిక సాంకేతికతను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.

దిశ, బొంరాస్ పేట్: ఆధునిక సాంకేతికతను యువత సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. దుద్యాల మండలం హకీంపేట పరిసరాల్లో నూతనంగా నిర్మించే అధునాతన సాంకేతిక కేంద్రానికి కాంగ్రెస్ పార్టీ కొడంగల్ ఇంచార్జి తిరుపతి రెడ్డి తో కలిసి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దేశంలో ఎక్కడలేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఏటీసీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4000 కోట్ల రూపాయలతో ఏటీసీ, ఐటిఐ లను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.
7 కోట్ల 20 లక్షల వ్యయంతో హాకీంపేటలో చేపట్టే ఆధునాతన సాంకేతిక కేంద్రం ద్వారా యువత భవిష్యత్తును మార్చే విధంగా ఉంటుందని ఆయన అన్నారు. భవన నిర్మాణమే కాకుండా అధునాతన యంత్రాల కొనుగోలు కోసం 36 కోట్ల రూపాయలను వెచ్చించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ యువతకు అందుబాటులో ఉండే విధంగా ఏటీసీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని మంత్రి అన్నారు. యువత సాంకేతిక రంగాల్లో తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఉపాధి పొందాలని మంత్రి పిలుపునిచ్చారు. యువత సాంఘిక రంగాన్ని అంది పుచ్చుకున్నట్లయితే ఉద్యోగాలు పొందడం చాలా సులభం అని మంత్రి అన్నారు.
అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని యువతను ప్రోత్సహిస్తూ ఏటిసిల్లో చేరే విధంగా చూడాలని మంత్రి సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంచి తెలిపారు. భూమి పూజ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, ఇండస్ట్రీస్ జోనల్ మేనేజర్ కవిత, ఏటిసి ప్రిన్సిపల్ కన్వీనర్ నరేంద్రబాబు, ఏటీసీ ప్రిన్సిపల్ శ్యాంసుందర్ , తహసిల్దార్ కిషన్ లతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






