- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30 ఏళ్ల తర్వాత కలిసిన స్నేహితులు
బొంరాస్ పేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో 10వ తరగతి 1996–97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు.

దశ, బొంరాస్ పేట్ : బొంరాస్ పేట్ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రాంగణంలో 10వ తరగతి 1996–97 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమై, అనంతరం మరణించిన గురువులు, సహ విద్యార్థుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాల మౌనం పాటించి వారికి నివాళులు అర్పించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఆనాటి గురువులు రఘువీర్ సింగ్, చంద్రశేఖర్ పిఈటీ, వెంకట్రాములు, నర్సప్ప, చెన్బసప్ప హాజరై, పూర్వవిద్యార్థుల చేత సత్కారాలు అందుకున్నారు. 30 సంవత్సరాల అనంతరం పూర్వ విద్యార్థులు కుటుంబ సమేతంగా కలుసుకోవడం ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది.
ప్రతి ఒక్కరు తమ జీవిత ప్రయాణం, సాధించిన విజయాలు, విద్యార్థి దశలోని మధుర జ్ఞాపకాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గురువులు కూడా తమ అనుభవాలను పంచుకుంటూ, భవిష్యత్తులో ఎలా ముందుకు సాగాలో విలువైన మార్గదర్శకాలు అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేష ఆకర్షణగా నిలిచింది. ముగింపులో అందరికీ జ్ఞాపికలు అందజేసి, గ్రూప్ ఫోటో తీసుకుంటూ ఆ మధుర క్షణాలను స్మరించుకున్నారు. అనంతరం భోజనాలతో స్నేహబంధాలను మరింత బలపరుచుకుంటూ ఆనందంగా గడిపారు. బ్యాచ్ సభ్యుల సమిష్టి కృషితో ఈ ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా, స్ఫూర్తిదాయకంగా నిలిచింది.






