చలికి గ్రామాలు గజ గజ.. కమ్మేస్తున్న పొగ మంచు

by Ajay Maddhiboyina |

రోజు రోజుకు చలి తీవ్రత గణనీయంగా పెరుగుతుండడంతో గ్రామాల్లో ప్రజలు వణికిపోతున్నారు.. గత వారం రోజులుగా యాచారం మండల వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పగటి సమయంలోనూ చలి వాతావరణం నెలకొంటోంది.

చలికి గ్రామాలు గజ గజ.. కమ్మేస్తున్న పొగ మంచు
X

దిశ, యాచారం : రోజు రోజుకు చలి తీవ్రత గణనీయంగా పెరుగుతుండడంతో గ్రామాల్లో ప్రజలు వణికిపోతున్నారు.. గత వారం రోజులుగా యాచారం మండల వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో పగటి సమయంలోనూ చలి వాతావరణం నెలకొంటోంది. ప్రధాన రహదారైన నాగార్జునసాగర్ రోడ్డుపై ఉదయం 7 నుండి 8 గంటల వరకు మంచు కమ్ముకుంటున్నది. దీంతో ఉదయమే బయటికి వెళ్లే పాల వ్యాపారులు, పొలాల్లోకి వెళ్ళే కూరగాయల రైతులు, నగరం బాటపట్టే ఉద్యోగులు, కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. బైకర్లు, బస్సు డ్రైవర్లు లైట్ల సహాయంతో వాహనాలను నడుపుతున్నారు. చలి తీవ్రతను తట్టుకోలేక గ్రామాలలోని వీధులలో చలి మంటలతో ఉపశమనం పొందుతున్నారు.

జాగ్రత్తలు అవసరం

చలి గాలుల తీవ్రత పెరుగుతున్నందున ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. అత్యవసర ప్రయాణాలు చేసేటప్పుడు స్వెట్టర్లు, చేతులకు గ్లౌజులు ధరిస్తే మంచిదని చెబుతున్నారు. అత్యవసరం అయితే తప్ప చలి సమయంలో బయటకు రాకూడదని సూచిస్తున్నారు.

Next Story