నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ : డీసీపీ శ్రీనివాస్

by Elthuri vijay kumar |

నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు.

నేరాల నియంత్రణకే కార్డన్ సెర్చ్ : డీసీపీ శ్రీనివాస్

- హసన్ నగర్ లో 300 మంది పోలీస్ సిబ్బంది తనిఖీ

- 55 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు, 2 బెల్ట్ షాపులు సీజ్

దిశ, రాజేంద్రనగర్: నేరాల నియంత్రణకు కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు రాజేంద్రనగర్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాల మేరకు శనివారం తెల్లవారు జామున 6 గంటలకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హసన్ నగర్, ఇంద్ర నగర్ ప్రాంతాలలో కార్దెన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 300 మంది సిబ్బంది పాల్గొనగా 12 సెర్చ్ టీంలతో పాటు 5 ప్రధాన అర్హదారులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఈ తనిఖీలలో 55 ద్విచక్ర వాహనాలు, అందులో సరైన పత్రాలు లేని 16 వాహనాలు, నెంబర్ ప్లేట్స్ లేకుండా 35 నడుస్తున్న వాహనాలు, సరైన పత్రాలు లేని 6 ఆటోలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న 9 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 2 బెల్టుషాపులను సీజ్‌ చేశారు. 2 హుక్కా సెంటర్లు, గ్యాస్ ఫిల్లింగ్ రీఫిల్ సెంటర్లపై దాడులు చేశారు. చెక్ పోస్ట్ ల వద్ద వాహనాలను పరిశీలించి చలానాలు కట్టకుండా తిరుగుతున్న వాహనాలను గుర్తించి చలనాలు కట్టించారు. 475 మంది వ్యక్తుల ఆధార్ కార్డులను పరిశీలించగా అందులో 27 మంది పక్క రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. ఆరుగురు రౌడీషీటర్ల ఇళ్లలోకి వెళ్లి సత్ప్రవర్తనతో మెలగాలని పాత నేరస్తులకు సూచించారు. వారి కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నట్లు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ సరఫరా వంటివి దృష్టికి వస్తే వెంటనే డయల్ 100 ను సంప్రదించాలని, లేదా నేరుగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని , సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. కార్డెన్ సెర్చ్ లో అదనపు డీసీపీ ఏఎస్ రావు, ఏసీసీ శ్రీనివాస్, సీఐలు నాగేశ్వరరావు, క్యాస్ట్రో నరేందర్, డీఐలు, ఎస్సై లు పాల్గొన్నారు.

Next Story