- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్న భరోసా సొమ్ము
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి నిధుల విడుదల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించా రు.

మొదటి విడత రైతు భరోసా రూ.137.11కోట్లు
l రంగారెడ్డి జిల్లాలోని 2,89,448 మంది రైతులకు లబ్ది.. ఆనందంలో రైతాంగం
l ఎకరానికి రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12వేలు అందిస్తున్న ప్రభుత్వం
l సిద్దిపేట జిల్లా నర్మెట్టలో లాంఛనంగా శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి
l నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్న భరోసా సొమ్ము
l రైతు భరోసాను ప్రత్యక్ష ప్రసారం ద్వారా
రైతు వేదికల్లో వీక్షించిన జిల్లా రైతాంగం
దిశ, రంగారెడ్డి బ్యూరో : రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాసంగి రైతు భరోసా నిధుల ను ప్రభుత్వం విడుదల చేసింది. సిద్దిపేట జిల్లా న ర్మెట్టలో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి నిధుల వి డుదల కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించా రు. రంగారెడ్డి జిల్లాలో మొదటి విడతలో రూ. 137.11కోట్లు విడుదల అయ్యాయి. దీని వల్ల జి ల్లాలోని 2,89,448 మంది రైతులకు లబ్ది కలుగు తోంది. మొత్తం మూడు విడతల్లో పూర్తి స్థాయి ని ధులను విడుదల చేయనున్నారు. ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో మొదటి విడత డ బ్బులు సోమవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
ఎన్నికలతో ఆలస్యం..
పంటల సాగుకు పెట్టుబడుల కోసం రైతాంగం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గత బీఆర్ ఎస్ ప్రభుత్వం 2018లో రైతు బంధు పేరుతో ఎ కరానికి రూ.5వేల చొప్పున రెండు సీజన్లకు రైతు లకు అందజేస్తూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా పేరుతో ఎ కరానికి రూ.6వేల చొప్పున ఏడాదికి రూ.12వేలు అందజేస్తోంది. రబీ సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ ఏడాది జనవరిలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిం ది. అయితే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల నేప థ్యంలో ఆలస్యమైంది. ఎట్టకేలకు ప్రభుత్వం ఆది వారం రైతు భరోసా నిధులను విడుదల చేయడం తో రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది.
సిద్దిపేటకు తరలివెళ్లిన రైతాంగం..
సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆదివారం జరిగిన రైతు భరోసా నిధులు విడుదల కార్యక్రమానికి జిల్లాకు చెందిన రైతాంగం నాలుగు బస్సుల్లో తరలివెళ్లిం ది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో తలకొండపల్లి, మాడ్గుల, ఆమన్‌గల్, కేశంపేట, షాబాద్ మండలాలకు చెందిన సుమారు 200 మంది రైతులు తరలివెళ్లి సీఎం కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిం చారు. అలాగే అక్కడి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సైతం సందర్శించారు. అధికారులు జెండా ఊపి బస్సులలో రైతులను పంపించారు. జిల్లాలోని 58 రైతు వేదికల్లో రైతు భరోసా నిధుల విడుదల కా ర్యక్రమాన్ని వీసీ యూనిట్ ద్వారా రైతులు వీక్షిం చారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉష, ఉ ద్యానవన శాఖ అధికారి సురేష్ అబ్దుల్లాపూర్ మెట్ రైతు వేదిక నుంచి రైతులతో కలిసి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు.






