మాతృ, శిశు మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి : జిల్లా వైద్యాధికారి

by Disha Web Desk 20 |
మాతృ, శిశు మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి : జిల్లా వైద్యాధికారి
X

దిశ, శంషాబాద్ : మాతృ, శిశు మరణాలు జరగకుండా అప్రమత్తంగా ఉండి పనిచేయాలని రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్ రావు అన్నారు. రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శేర్లింగంపల్లి, గండిపేట్, శంషాబాద్, రాజేంద్రనగర్ పీహెచ్ సీ ల రివ్యూ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆరోగ్య కార్యక్రమాలు అన్నిసజావుగా జరగాలన్నారు.

మాత శిశు ఆరోగ్యం. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లలకు బుధవారం, శనివారం వేసే వ్యాక్సిన్ లను ఉదయం ఎనిమిది గంటలకల్లా పీహెచ్సీ లలో ఉండి ప్రతి ఒక్కరికి విధిగా వ్యాక్సినేషన్ చేయాలన్నారు. చిన్నపిల్లలు ఆసుపత్రికి వచ్చినప్పుడే వ్యాక్సిన్ ఓపెన్ చేయాలని ఓపెన్ చేసి నాలుగు గంటల్లోనే వ్యాక్సిన్ కంప్లీట్ చేసే విధంగా చూసుకోవాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు అన్నింటిలో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని సిబ్బందికి కేటాయించిన లక్ష్యాలను 100% పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ స్వర్ణకుమారి, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సృజన, డాక్టర్లు, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.

Next Story