- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం చోరీ కేసును ఛేదించిన బాలాపూర్ పోలీసులు
by Ratna Kumari |
బాలాపూర్ పోలీసులు దొంగతనం కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

X
దిశ, బడంగ్ పేట : బాలాపూర్ పోలీసులు దొంగతనం కేసును ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 14న డ్రీమ్ లేక్ కాలనీలో దొంగతనం జరిగినట్టు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసుకున్న బాలాపూర్ పోలీసులు రెండు టీమ్ లుగా ఏర్పడి సీఐ సుధాకర్, డిటెక్టివ్ సబ్ ఇన్ స్పెక్టర్ కోటేశ్వరరావు కలిసి దర్యాప్తు ప్రారంభించారు. సీఐ సుధాకర్ చెప్పిన వివరాల ప్రకారం.. బాలాపూర్ ప్రాంతంలో అనుమానస్పదంగా తిరుగుతున్న రాత్రి పూట దొంగతనం చేయడంలో సిద్ధస్తుడైన పాత నిందితుడు షాహీన్ నగర్ ప్రాంతానికి చెందిన హబీబ్ మహ్మద్ అలియాస్ చోటు ని అదుపులోకి విచారించారు.
దొంగతనం చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నట్టు బాలాపూర్ సీఐ సుధాకర్ తెలిపారు. నిందితుడి పై మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో 60 కేసులున్నాయని తెలిపారు. నిందితుని నుంచి రూ.20లక్షలు విలువ చేసే 14 తులాల బంగారం రికవరీ చేసినట్టు తెలిపారు. నిందితుల నుంచి బంగారాన్ని కొనుగోలు చేసిన మహమ్మద్ హుస్సేన్, నిందితుడు హబీబ్ మహమ్మద్ అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్టు సీఐ సుధాకర్ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన బాలాపూర్ పోలీస్ సిబ్బందిని ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి అభినందించారు.
Next Story






