- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నం
రోడ్డు పక్కన ఆదా మరిచి నిద్రిస్తున్న మతిస్థిమితం లేని మహిళపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

X
దిశ, యాచారం : రోడ్డు పక్కన ఆదా మరిచి నిద్రిస్తున్న మతిస్థిమితం లేని మహిళపై యువకుడు అత్యాచారయత్నానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండల పరిధిలోని మాల్, మార్కెట్ పరిసర ప్రాంతాల్లో మతిస్థిమితం సరిగా లేని ఓ మహిళ గత కొంతకాలంగా సంచరిస్తోంది. మర్రిగూడ, మండలానికి చెందిన పోలే శ్రీశైలం (25) భవాని హోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. డిసెంబర్ 9వ తేదీన ఎస్బీఐ బ్యాంకు సమీపంలో అర్ధరాత్రి మతిస్థిమితం లేని మహిళ నిద్రిస్తుండగా అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ మహిళ ప్రతిఘటించి బిగ్గరగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. రెండు నెలల అనంతరం సీసీ కెమెరాను పరిశీలించగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






