- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదర్‌గూడలో యువకుడు హల్చల్..మూడు గంటల పాటు హంగామా
నిర్మాణంలో ఉన్న భవనం ఎక్కిన ఓ యువకుడు కిందికి దూకుతానని మూడు గంటల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు.

దిశ, రాజేంద్రనగర్: నిర్మాణంలో ఉన్న భవనం ఎక్కిన ఓ యువకుడు కిందికి దూకుతానని మూడు గంటల పాటు పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. పోలీసులు చాకచక్యంగా అతన్ని మాటల్లో పెట్టి కిందకి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ డివిజన్ హైదర్గూడ సిరిమల్లె నగర్ లో ఆదివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మండలం ఘాన్సీ మియా గూడ కు చెందిన ఎల్లయ్య గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడు స్వగ్రామం నుంచి అత్తాపూర్ లోని సిరిమల్లె నగర్ కు వచ్చాడు.
నిర్మాణంలో ఉన్న ఓ భవనం పైకి ఎక్కాడు. గోవ కట్టెల చివరి అంచున నిలబడి కిందకు దూకేస్తానని స్థానికులను బెదిరించాడు.వారు డయల్ 100కు కాల్ చేయడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తన దగ్గరికి వస్తే కిందకు దూకేస్తానని ఎల్లయ్య బెదిరింపులకు పాల్పడ్డాడు. మూడు గంటల పాటు పోలీసులను, స్థానికులను ముప్పు తిప్పలు పెట్టాడు. ఎస్సై రఘు రంగంలోకి దిగి అతన్ని మాటల్లో పెట్టాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి పైకి వెళ్లి అతనిని కిందికి తీసుకొచ్చారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చాకచక్యంగా వ్యవహరించి ఎల్లయ్యను కాపాడిన పెట్రోలింగ్ కానిస్టేబుల్ రాఘవేంద్ర, అంజలయ్య, లేడీ కానిస్టేబుల్ ను స్థానికులు అభినందించారు.






