చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే ప్రచారం చేశా : నటుడు రానా

by Naga Rani Yarlagadda |

బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ పూర్తయిన అనంతరం నటుడు రానా మీడియాతో మాట్లాడారు. కాంత సినిమా చూశారా అంటూ ఫన్నీ కామెంట్స్ చేశారు.

చట్టబద్ధమైన యాప్ అని తెలుసుకున్న తర్వాతే ప్రచారం చేశా : నటుడు రానా
X

దిశ, వెబ్‌డెస్క్: బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తూ.. పలువురు ఇండస్ట్రీ సెలబ్రిటీలు ప్రచారం చేయడంపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసును సీఐడీ సిట్ విచారణ చేస్తోంది. ఇందులో భాగంగా.. టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా నేడు సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. సుమారు గంట విచారణ తర్వాత బయటికి వచ్చిన రానా.. బెట్టింగ్ యాప్స్ ప్రచారంపై స్పందించారు. తాను బెట్టింగ్ యాప్ చట్టబద్ధమైనదని తెలుసుకున్నాకే ప్రచారం చేశానని మీడియాకు తెలిపారు. ఈ యాప్ ప్రచారంపై తన న్యాయ బృందం పూర్తిగా విచారణ చేసిందన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐడీ అధికారులకు వివరించినట్లు తెలిపారు. తొలుత కాంత సినిమా చూశారా అంటూ ఫన్నీగా మాట్లాడిన రానా.. సెకండాఫ్ లెంగ్త్ ఎక్కువైందని, దానిని ట్రిమ్ చేస్తామంటూ జోక్స్ వేశారు.

రాష్ట్రంలో బెట్టింగ్ యాప్‌ల మోజులో పడి అనేక మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వాటి కారణంగా అప్పుల పాలై, వారి బెదిరింపులకు తాళలేక అర్థంతరంగా జీవితాలను చాలించిన వారెందరో ఉన్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ లపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సీఐడీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)ను ఏర్పాటు చేయగా.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కొన్ని నెలల క్రితం కేసు నమోదయింది.

Next Story