- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పబ్లిక్ స్టంట్‌లకు కేరాఫ్ అడ్రస్ కేటీఆర్: రామ్మోహన్ రెడ్డి ఫైర్
రాష్ట్ర చిహ్నంలో ప్రభుత్వం ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చిందని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర చిహ్నంలో ప్రభుత్వం ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చిందని మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో తయారు చేసిన ఎంబ్లమ్‌లో రాచరిక పోకడ గుర్తింపులు తొలగించామన్నారు. ‘‘అసలు సిసలైన తెలంగాణ వాదులు పోరాటానికి ప్రతీకలైన అమరవీరులు, సమ్మక్క సారక్కల వైపు నిలుస్తారు. కేవలం కల్తీ గాళ్లు, కుంభకోణాలు చేసినోళ్లు రాజులు, నవాబులు వైపు నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ఇక కేటీఆర్ పబ్లిసిటీ స్టంట్‌లకు కేరాఫ్అడ్రస్గా మారుతున్నారన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో కేటీఆర్‌లు ఫోటో షూట్ రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఇటీవల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా శేరిలింగంపల్లిలో మృతి చెందిన రెండు కుటుంబాలకి రూ.లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారన్నారు.
అయితే ఆ రెండు కుటుంబాలకి లక్ష సాయం చేయలేదన్నారు. కేవలం ఫోటో కోసం ఒక్కరికే చేసి ఇద్దరికీ సహాయం చేశానని కేటీఆర్ చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు. అధికారం పోయినా, మమకారం తగ్గలేదన్నారు. అయ్యా, కొడుకులు (కేసీఆర్, కేటీఆర్ లను ఉద్దేశించి)కలిసి పదేళ్ల అమరుల త్యాగాలను కనుమరుగు చేశారన్నారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కుటిల రాజకీయంలో ఆర్ఎస్‌పీ కూడా భాగస్వామ్యం అవడం విచిత్రంగా ఉన్నదన్నారు.






