- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజాసింగ్ అంశం నా పరిధిలోనిది కాదు: రాంచందర్ రావు
బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలని కోరడంలో తప్పు లేదని.. తాము కూడా పొన్నం ప్రభాకర్ లేదంటే మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సీఎం చేయాలని అడుగుతున్నామని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయాలని కోరడంలో తప్పు లేదని.. తాము కూడా పొన్నం ప్రభాకర్ లేదంటే మహేశ్‌కుమార్‌గౌడ్‌ను సీఎం చేయాలని అడుగుతున్నామని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. బీజేపీకి ఉన్న బీసీ సమజాన్ని దూరం చేయడం కోసమే కాంగ్రెస్ ఈ ప్రయత్నాలు చేస్తున్నదని ఆరోపించారు. కర్ణాటకలో మళ్ళీ సర్వే చేస్తున్నారంటే అక్కడ తప్పు జరిగిందని ఒప్పుకున్నారా..? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్, బీఆర్ఎస్ యాక్టింగ్ చేస్తున్నాయని అన్నారు. ఆ కేసును సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవరైనా పొలిటికల్ లీడర్ అరెస్ట్ అయ్యారా..? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పనిచేసిన అధికారుల వద్దనే వందల కోట్లు దొరుకుతున్నాయని.. పొలిటికల్ లీడర్ వద్ద ఇంకా ఎంత దొరకాలని.. వారిపై ఎందుకు రెయిడ్స్ చేయడం లేదని నిలదీశారు. బీఆర్ఎస్‌పైనే రేవంత్‌రెడ్డికి ప్రేమ ఉందని.. ఆయన ఆ పార్టీ స్టేట్స్ సెక్రెటరీగా పనిచేశారని అన్నారు. ఓటు నోటు కేసులో రేవంత్‌రెడ్డిపై చర్యలు లేవని.. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో బీఆర్ఎస్ నేతలపై ఉండవని పేర్కొన్నారు. బీసీ ఈ పేరుతో 4 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు ఇచ్చారని.. ఇప్పుడు వాటిని 10శాతం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాజాసింగ్ అంశం నా పరిధిలోనిది కాదు..
రాజసింగ్ విషయం తన పరిధిలోనిది కాదని.. జాతీయ నాయకత్వం చూసుకుంటుందని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికపై తాము సీరియస్‌గా ఉన్నామని చెప్పారు. అక్కడి నుండి చాలామంది టికెట్ అడుగుతున్నారని.. కిషన్‌రెడ్డి పార్లమెంటు పరిధిలో ఉండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని వెల్లడించారు. అక్కడి ఓటర్ల మూడ్ మారుతున్నదని.. బీజేపీకి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని అన్నారు. హైడ్రా తెచ్చి పేదల ఇండ్లు కూలకొట్టారని.. ఇప్పుడు దేవాలయాలను కూలకొడుతున్నారని.. పేదల ఇండ్లు కూల్చి నట్టే రేవంత్‌రెడ్డి సర్కార్ కూలిపోతుందని హెచ్చరించారు. ఫాతిమా కాలేజీపై ఉన్న మానవతావాదం పేదల ఇండ్లపై ఎందుకు లేదని నిలదీశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని.. ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. టీడీపీ ఇక్కడ పోటీ చేస్తుందా లేదా తనకు తెలియదన్నారు. రాష్ట్ర కమిటీ వేయడం తన ముందు ఉన్న మొదటి టాస్క్ అని.. 18 మంది ఆఫీస్ బేరర్స్ ఉంటారని రాంచందర్‌రావు వెల్లడించారు. అందులో 8 మంది ఉపాధ్యక్షులు, ఏడుగురు కార్యదర్శులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు ఉంటారని.. సీనియర్ నాయకుల అభిప్రాయాలతో వారం రోజుల్లో కమిటీ పూర్తిచేస్తామని చెప్పారు. పార్టీ నేతలు పదవుల కోసం చూడొద్దని.. ప్రజల్లో ఉండాలని సూచించారు.






