Rajasingh: పార్టీలో చేరిన మొదటి రోజు మాత్రమే కుర్చీ.. బీజేపీలో చేరికలపై రాజాసింగ్ హాట్ కామంట్స్

by Prasad Jukanti |

బీజేపీలోకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చేరిక నేపథ్యంలో రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rajasingh: పార్టీలో చేరిన మొదటి రోజు మాత్రమే కుర్చీ..  బీజేపీలో చేరికలపై రాజాసింగ్ హాట్ కామంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో (T BJP) చేరికలపై ఆ పార్టీ మాజీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Rajasingh) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరిన మొదటి రోజు మాత్రమే సీట్లో కూర్చోబెడతారని ఎన్నికల ముందు ఆశించిన టికెట్ వస్తుందనే నమ్మకం కూడా ఉండదని ఎక్కడో చివరకు పంపేస్తారని బీజేపీలోకి కొత్తగా చేరుతున్న వారికి సూచనలు, హెచ్చరికలు చేశారు. బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది ఏదీ దొరకదని.. పార్టీలో చేరిన తర్వాత కుట్రలు, కుతంత్రాలు, బాధపెట్టడం, సంతోషపడటం వంటివి నేర్చుకోవాలని హాట్ కామెంట్స్ చేశారు. గోషామహల్ అసెంబ్లీలో గత 11 ఏళ్లుగా కొందరి వల్ల అణచివేతకు గురవుతున్నాం. బీజేపీ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. కానీ నమ్మిన ప్రజలకు ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నేతలు, కార్యకర్తలు బీజేపీకి ఎందుకు గుడ్ బాయ్ చెప్పారో బీజేపీలో చేరుతున్నవారు తెలుసుకోవాలన్నారు. బీజేపీలో చేరడానికి ముందు వాళ్లతో చర్చలు జరిపి తెలుసుకోవడం మంచిదన్నారు. ఇవాళ కాకపోతే రేపు తెలంగాణ బీజేపీలో ఉన్న రాక్షసులు అంతమవుతాయి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తల ఆశీస్సులతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. అయితే ఇటీవల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (Guvvala Balaraju) బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో బీజేపీలో రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది.

Next Story